Malavika Mohanan | మాళవిక మోహనన్ వింత కోరిక.. ఆ రోల్‌లో నటించాలని ఉందట!
Malavika Mohanan | దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మోహనన్. ఓ విభిన్న పాత్రపై తన మనసులోని కోరికను బయటపెట్టింది. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలో నటించాలని ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘గ్యాంగ్‌స్టర్‌గా నటించాలనుంది’ అని బదులిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ‘ఆస్క్ విత్ మాళవిక’ పేరుతో ముచ్చటించింది.
Entertainment | Published On Sep 9, 2026, 12.30 pm IST
Malavika Mohanan | దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మోహనన్. ఓ విభిన్న పాత్రపై తన మనసులోని కోరికను బయటపెట్టింది. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలో నటించాలని ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘గ్యాంగ్‌స్టర్‌గా నటించాలనుంది’ అని బదులిచ్చింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ‘ఆస్క్ విత్ మాళవిక’ పేరుతో ముచ్చటించింది. తన వ్యక్తిగత ఇష్టాల గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నది. ముఖ్యంగా తనతో పాటు సర్దార్-2 హీరో కార్తి ఫుడ్ లవర్స్‌మేనని తెలిపింది. ఎవరు ఎక్కువగా తింటారన్న ప్రశ్నకు.. ఇద్దరికీ తిండి, స్నాక్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా స్నాక్స్ తినగలనని.. సినిమా ప్రమోషన్స్ సందర్భంగా కార్తికి కూడా తనలాంటి అలవాటే ఉందని తెలుసుకున్నానని పేర్కొంది.
కార్తి కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్దార్ 2’కు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సర్దార్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చిత్ర ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తి మాట్లాడుతూ.. సినిమాలో ప్రస్తావించిన అంశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఓ కీలకమైన అంశాన్ని ఇందులో ప్రస్తావించామని.. సినిమా చూసిన తర్వాత ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగే విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేరని తెలిపింది. ఇక ‘సర్దార్’ తొలి భాగంలో బిజినెస్‌పరంగా నీటి విక్రయాలు, నీటి వ్యాపారాన్ని దర్శకుడు పీఎస్ మిత్రన్ ప్రధాన అంశంగా చూపించారు. ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో భాగంలో ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు.
‘సర్దార్ 2’ షూటింగ్‌ను చిత్రబృందం గతేడాది జూన్‌లో బ్యాంకాక్‌లో పూర్తి చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 100 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. సీక్వెల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో.. కార్తి పాత్రను కంబోడియాకు స్పై మిషన్‌పై పంపుతున్నట్లు చూపించారు. కథ కంబోడియా నుంచి చైనాకు వెళ్తుందని దర్శకుడు మిత్రన్ గతంలో వెల్లడించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ జార్జ్ విలియమ్స్, సంగీతం సామ్ సీఎస్ అందించారు. ఎడిటింగ్ విజయ్ వేలుకుట్టి. ఆర్ట్ డైరెక్షన్‌ను ఎంఎస్‌పీ మాధవన్, బీ శేఖర్ నిర్వహించారు. రత్నకుమార్, ఆశామీరా అయ్యప్పన్, విఘ్నేశ్ మునియాండన్ కథ అందించారు. యాక్షన్ కొరియోగ్రఫీని దిలీప్ సుబ్బరాయన్, చేతన్ డిసౌజా చేశారు.
Read More Also :
Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!
Priyanka Mohan | ప్రియాంక మోహన్ కెరీర్‌కు బ్రేక్.. వరుసగా చిన్న సినిమాలే! అసలేం జరుగుతోంది?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
సెప్టెంబర్ 8, 2026

Ashika Ranganath | స్ట్రైప్స్ సారీలో ఆషికా రంగనాథ్.. అందంతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..!
సెప్టెంబర్ 8, 2026

Priyanka Mohan | ప్రియాంక మోహన్ కెరీర్‌కు బ్రేక్.. వరుసగా చిన్న సినిమాలే! అసలేం జరుగుతోంది?
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..
- ●Chanagani Dayakar | కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. భాష మార్చుకోకపోతే తరిమికొడతారు
- ●Ethiks Committee | ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ వ్యవహారం

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థిని నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం

BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..

Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..



