Tula Uma | బండి సంజయ్.. నీ కొడుకును పోలీసులకు అప్పజెప్పు : తుల ఉమా డిమాండ్
Tula Uma | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు నైతికత ఉంటే తన కొడుకును తక్షణమే పోలీసులకు అప్పగించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు.
మొదటి ముద్దాయి నువ్వే.. తక్షణం మంత్రి పదవికి రాజీనామా చెయ్
నీ ధర్మం, న్యాయం ఏమైనయ్?
ఈ కేసును పక్కదారి పట్టించే వాళ్లంతా నేరస్థులే
బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమా ఫైర్
Tula Uma | త్రినేత్ర.న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు నైతికత ఉంటే తన కొడుకును తక్షణమే పోలీసులకు అప్పగించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. మంగళవారం మధుర నగర్‌లోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్‌రెడ్డిని బీఆర్ఎస్ మహిళ నాయకులతో కలిసి బండి భగీరథ్‌పై ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
బాలిక కుటుంబానికి మేం అండగా ఉంటం..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసును పక్కదారి పట్టించొద్దు. బండి భగీరథ్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నరు. కమిషన్ చైర్‌పర్సన్ చాలా సానుకూలంగా స్పందించారు. ఆధారాలతో ఉన్న కేసును సుమోటాగా తీసుకున్నం అని చెప్పారు. పేట్ బషీరాబాద్ పోలీసులకు సమన్లు పంపించామన్నారు. కరీంనగర్ పోలీసులకు కూడా పంపిస్తామని చెప్పారు. నిందితుడికి కచ్చితంగా శిక్ష పడేటట్లు చేస్తమన్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నం. అమ్మాయికి అండగా ఉంటం. కేసులో ఉన్నవాళ్లు, దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నవాళ్లంతా నేరం చేసినవాళ్లవుతారు అని ఉమా హెచ్చరించారు.
బండి భగీరథ్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బండి సంజయ్‌కు నైతికత ఉంటే కొడుకును పోలీసులకు అప్పజెప్పాలి. ధర్మం, న్యాయం అని ఎక్కువ మాట్లాడుతడు. ఈరోజు నీ ధర్మం ఎటువోయింది? నీ కొడుకును కాపాడుతున్నవంటే నువ్ కూడా నేరం చేసినట్టే. మొదటి ముద్దాయి బండి సంజయ్ కుమారే. కాబట్టి ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. నైతిక బాధ్యత వహించి కూడా రాజీనామా చేయాలి. బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవాలి అని బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇంచార్జ్ మాగంటి సునీత, అడ్వకేట్ లలిత రెడ్డి, పలువురు మహిళా నాయకులు బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



