RS Praveen Kumar | అసలు ఎవరీ సాయి ప్రసాద్? ఆయన వెనుక సీఎం ఉన్నారా? నామ్ కే వాస్తే కేసులు పెట్టాలని చెప్పిందెవరు?
RS Praveen Kumar | బీజేవైఎం నేషనల్ ట్రెజరర్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది.. ఆమె మా పార్టీ కాకపోయినా.. ఒక మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాం అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
RS Praveen Kumar | త్రినేత్ర న్యూస్ : బీజేవైఎం నేషనల్ ట్రెజరర్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది.. ఆమె మా పార్టీ కాకపోయినా.. ఒక మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాం అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కీచకులకు, కామాంధులకు బీజేపీ అంత పెద్ద పోస్టులు ఎలా ఇస్తుంది.. బీజేపీ మహిళా నేతలు సమాధానం చెప్పాలి అని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేస్తున్న ఓ మహిళా.. బీజేపీ యువ మోర్చా మాజీ నేషనల్ ట్రెజరర్ సాయి ప్రసాద్‌పై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తేనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ దోస్తీ అంత బలమైనది. అంతేకాదు నామ్ కే వాస్తే కేసు పెట్టాలని ఫయీమ్, శ్రీరామ్ కర్రి చెప్పారట. ఆమె ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. సాయి ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.
సాయి ప్రసాద్ అనే వ్యక్తి బాధిత మహిళను 2024 డిసెంబర్ 24న బెడ్ రూమ్‌లోకి రమ్మని వేధించారు. 2025లోను ఇదే రకంగా సాయి ప్రసాద్ అనే వ్యక్తి వేధించారు. ఇలాంటి కామాంధులకు బీజేపీ జాతీయ స్థాయిలో పదవులు ఎట్లా ఇచ్చింది. బీజేపీలో ఉన్న మహిళా నేతలు డీకే అరుణ, మాధవీ లత, రాణిరుద్రమ సమాధానం చెప్పాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.
బీజేపీలో 30 ఏళ్ల నుంచి ఉన్న వారు రాష్ట్ర స్థాయి లీడర్లు కాలేకపోయారు. కానీ సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఆరేళ్లలోనే బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ అయ్యారు. ప్రముఖులతో సాయి ప్రసాద్ ఫొటోలు దిగారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయి ప్రసాద్ పెళ్లికి హాజరయ్యారు. అతనిపై 14 కేసులు ఉన్నాయి.. కచ్చితంగా రౌడీషీట్ ఓపెన్ చేయాలన్నారు.
సాయి ప్రసాద్‌కు ఉన్న ఐదు కంపెనీల్లో రెండు సంస్థలకు పొంగులేటి హర్షా రెడ్డి కో డైరెక్టర్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్ జరిగినా ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్యవర్తిగా ఢిల్లీలో సాయి ప్రసాద్ డీల్ మాట్లాడారు. దీనిపై అమిత్ షా, నితిన్ నబీన్ స్పందించాలన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు
- ●Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చర్చించడం ఆశ్చర్యమేసింది..! కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ●Electric Vehicles | సెప్టెంబర్‌లో ఈవీల జోరు.. దూసుకెళ్లిన టాటా, మహీంద్రా..
- ●Bhatti Vikramarka | జెన్కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించం : భట్టి విక్రమార్క
- ●Telangana Sahitya Akademi | నవంబర్ 14 బాలల దినోత్సవం: విద్యార్థుల ప్రతిభకు పట్టం.. ఉత్తమ రచనలతో ప్రత్యేక పుస్తకం
- ●Lenovo ThinkBook 14x | లెనోవో నుంచి 990 గ్రాముల థింక్‌బుక్.. ధర ఎంతంటే?

POCSO Cases Telangana | మగపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులు: తెలంగాణలో 9 నెలల్లో 62 పోక్సో కేసులు

Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చర్చించడం ఆశ్చర్యమేసింది..! కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Electric Vehicles | సెప్టెంబర్‌లో ఈవీల జోరు.. దూసుకెళ్లిన టాటా, మహీంద్రా..

Bhatti Vikramarka | జెన్కో, ట్రాన్స్‌కోను ప్రయివేటీకరించం : భట్టి విక్రమార్క




