త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. ప‌చ్చ‌కామెర్లు వ‌చ్చినోళ్ల లెక్క‌నే ఉన్న‌రు

Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్ల ప‌రిస్థితి ప‌చ్చ కామెర్లు వ‌చ్చినోళ్ల లెక్క‌నే ఉంద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి విమ‌ర్శించారు. రేపు బీఆర్ఎస్ హెచ్ఆర్ఎస్ అవుతుంద‌ని.. హెచ్ఆర్ఎస్ అంటే హ‌రీశ్‌రావు రాష్ట్ర స‌మితి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Jun 28, 2026, 7.24 pm IST

Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. ప‌చ్చ‌కామెర్లు వ‌చ్చినోళ్ల లెక్క‌నే ఉన్న‌రు
Advertisement
  • పూట‌కో పార్టీ మార్చేటోళ్లు మాపై మాట్లాడుత‌రా?
  • బీఆర్ఎస్ రేపు హెచ్ఆర్ఎస్ అవుతుంది
  • హెచ్ఆర్ఎస్ అంటే ‘హ‌రీశ్‌రావు రాష్ట్ర స‌మితి’
  • న‌ల్ల‌గొండ ప్ర‌జ‌ల‌కు మూసీ ఇబ్బందులు ఉండ‌విక‌
  • న‌ల్లగొండ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య‌లు

Komati Reddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్: బీఆరెసోళ్ల ప‌రిస్థితి ప‌చ్చ కామెర్లు వ‌చ్చినోళ్ల లెక్క‌నే ఉంద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి విమ‌ర్శించారు. రేపు బీఆర్ఎస్ హెచ్ఆర్ఎస్ అవుతుంద‌ని.. హెచ్ఆర్ఎస్ అంటే హ‌రీశ్‌రావు రాష్ట్ర స‌మితి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన‌ సందర్భంగా నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి ప్ర‌సంగించారు. త్వ‌ర‌లోనే ఉమ్మ‌డి న‌ల్లగొండ ప్ర‌జ‌ల‌కు మూసీ ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ని చెప్పారు.

రూ.13 వేల కోట్లతో 5,300 km రోడ్లకు శంకుస్థాపన చేయడం సంతోషం. ఇందిరమ్మ పాలనలో ఆరు గ్యారంటీలతో పేద ప్రజల్లో సంతోషం. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదు. త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం. హ్యామ్ (HAM) రోడ్లపై BRS నేతల ఆరోపణలు అవాస్తవం. పార్టీ పేరు పూటకోసారి మార్చుకునే మీరు.. మా గురించి మాట్లాడటం విడ్డూరం. SLBCని అడ్డుకున్నది BRS పార్టీ. 2028 ఆగస్టు నాటికి SLBC పూర్తి చేసి తీరుతాం అని మంత్రి స్ప‌ష్టం చేశారు.

మూసీతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇబ్బందులు పడుతుంది. మనం అడగకముందే సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన చేపట్టారు. BRS పాలనలో కేసీఆర్ అపాయింట్‌మెంట్ (KCR appointment) ఇవ్వలేదు. కేసీఆర్‌, అంతకుముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ జిల్లాకు నిధులు ఇవ్వలేదు. నల్లగొండ కార్పొరేషన్ చేసినందుకు ధన్యవాదాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు ఇవ్వాలి. AMRP కెనాల్ లైనింగ్‌కి మరో రూ.500 కోట్లు ఇవ్వాలి. ప్రతి గ్రామంలో 30-40 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆయా ఇళ్లకు రూ.5లక్షల చొప్పున అందిస్తున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాలు గెలిపించి ఇస్తాం అని కోమ‌టిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement