త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం : బాల్క సుమ‌న్

Balka Suman | కోల్ బెల్ట్ ఏరియాలో టీబీజీకేఎస్‌కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం రావాలంటే కార్మికులంతా మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పిలుపునిచ్చారు. జీఎం ఆఫీసు కాల‌బెడుదాం.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం అని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On May 26, 2026, 8.06 pm IST

Balka Suman | మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం : బాల్క సుమ‌న్
Advertisement

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్ : కోల్ బెల్ట్ ఏరియాలో టీబీజీకేఎస్‌కు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం రావాలంటే కార్మికులంతా మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పిలుపునిచ్చారు. జీఎం ఆఫీసు కాల‌బెడుదాం.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం అని ఆయ‌న అన్నారు. కార్మికులు మ‌న‌ల్ని ఓన్ చేసుకునే విధంగా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన టీబీజీకేఎస్ సంఘం స‌మావేశంలో బాల్క సుమ‌న్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ దేశంలో మెల్ల‌గా మాట్లాడితే, నినాదాలు ఇస్తే మ‌న దిక్కు చూడ‌రు. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎగురుకుంటూ పోతే ఎవ‌ర్రా అని తిరిగి చూస్త‌రు. కోల్ బెల్ట్ ఏరియాలో టీబీజీకేఎస్‌కు మ‌ళ్లీ పూర్వ వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చ‌ట్లు చెప్పుడు కాదు.. మీటింగ్‌లు పెట్టుడు కాదు. సోష‌ల్ మీడియా, ప్రెస్‌మీట్లు కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మంద‌మ‌ర్రి డివిజ‌న్‌లో ఓ ప్రోగ్రాం పెట్టండి.. జీఎంగానీ ఆఫీసు కాల‌బెడుదం.. పోతే ఓ నెల రోజులు జైలుకు పోతం. కార్మికులు మ‌న‌ల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్లు మా కోసం కొట్లాడుతున్న‌రు.. కేసులు అయితున్న‌యి, లాఠీ ఛార్జీలు అయితున్న‌య‌ని, జైళ్లో పెట్టార‌ని మా నాయ‌క‌త్వం మీద న‌మ్మ‌కం రావాలి. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మ‌న ద‌గ్గ‌ర అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. ఒక రోజు రైల్ రోకో అని పెట్టి రైల్వే లైన్లు కోసి పారేయండి. సీరియ‌స్‌గా చెబుతున్నా.. సీరియ‌స్‌గా తీసుకోక‌పోతే.. కార్మిక‌వ‌ర్గం మ‌న దిక్కు తిరిగి చూడ‌రు. గ‌ట్టిగా చేయ‌లే.. నెల రోజులు జైలుకు పోయిరండి. గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చిన‌ట్టు ఫీల్ కావాలి.. వీళ్లే మా బిడ్డ‌లు.. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ప‌రాయివాళ్లు అనే ఫీలింగ్ కార్మికుల్లో రావాలి. మిలిటెంట్ యాక్టివిటీ సీరియ‌స్‌గా ప్లాన్ చేయాలి. ఇక్క‌డ సింగ‌రేణి భ‌వ‌న్‌ను కూడా కాల‌బెట్టండి. ఈ సీరియ‌స్‌నెస్ యాక్టివిటీలో క‌న‌బ‌డితే త‌ప్ప మ‌న వైపు కార్మికులు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. మ‌నకు దూర‌మైన వ‌ర్గాలు ద‌గ్గ‌ర‌వుతాయి. రాజ‌కీయాలు కూడా త‌గ్గుతాయి. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందించండి. కొత్త పంథాలో, కొత్త విధానంలో, కొత్త త‌ర‌హాలో ముందుకు పోతూ యువ‌త‌ను ఆక‌ర్షించే విధంగా ఉండాలి. పార్టీకి లాభం అయ్యే విధంగా పోరాడాలి. పార్టీ లేక‌పోతే సంఘం ఎక్క‌డ ఉంది. మ‌న‌కు అధి నాయ‌కుడు కేసీఆరే అని బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు.

యంగ్‌స్ట‌ర్స్‌ను సంఘంలో ఇన్వాల్వ్ చేయాలి..

బెల్లంప‌ల్లి నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు బీఆర్ఎస్ పార్టీ సీట్లు కోల్పోయింది. సింగ‌రేణి కోసం ఎంతో చేశాం. ఎక్క‌డ కోల్పోయామో అక్క‌డే రాబట్టుకోవాలి. కార్మిక సంఘాల‌ను బలోపేతం చేసుకోవాలి. సోష‌ల్ మీడియా యుగం న‌డుస్తుంది.. త‌మిళ‌నాడులో విజ‌య్ 50 శాతం వ‌ర‌కు క‌వ‌ర్ చేయ‌లేదు. అయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించి సీఎం అయ్యారు. మ‌హిళ‌లు, కార్మిక‌వ‌ర్గం, యువ‌త వ‌న్ సైడ్ చేశారు. మ‌ళ్లీ కోల్ బెల్ట్ ఏరియాలో గెలిచి కేసీఆర్‌ను సీఎం చేసుకోవాలి. అనుబంధ సంఘాలు క‌లిసి ప‌ని చేయాలి. కారుణ్యం కింద 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. పెండింగ్ డిపెండెంట్ స‌మ‌స్య ప‌రిష్క‌రించాం. యంగ్‌స్ట‌ర్స్‌ను సంఘంలో ఇన్వాల్వ్ చేయాలి. యువ‌త మీద దృష్టి పెట్టాలి అని బాల్క సుమ‌న్ సూచించారు.

మంత్రి వివేక్‌పై ఎందుకు తిర‌గ‌బ‌డ‌లేదు..

కార్మికుల్లో చైత‌న్యం రావాలి. కార్మికులు తిర‌గ‌బ‌డ‌త‌లేరు. కేసీఆర్ ఎన్నో చేసిండు.. మూడేండ్లు అయినా ఒక్క‌టి చేయ‌లేదు అని మంత్రి వివేక్‌పై ఎందుకు తిర‌గ‌బ‌డ‌లేదు.. రెబ‌ల్ ఏరియా మ‌న‌ది. చాలా చైత‌న్య‌వంత‌మైన ఏరియా.. అస‌లు ఎవ‌రూ ఖాళీగా ఉండ‌రు. గ‌ద్దెల మీద కూర్చుంటే ఇక్క‌డ్నుంచి ట్రంప్ దాకా అంద‌ర్నీ ఏస్త‌నే ఉంట‌రు. అంత చైత‌న్యం ఉన్న మన ఏరియాలో మంత్రిపై తిర‌గ‌బ‌డ‌లేక‌పోయారు. కార్మికుల‌ను మోటివేట్ చేయ‌డంలో మ‌నం చేయాల్సినంత ప‌ని చేయ‌లేక‌పోతున్నాం. ప్ర‌భుత్వం మీద తిర‌గ‌బ‌డేలా కార్యాచ‌ర‌ణ తీసుకోవాలి. సింగ‌రేణి కార్మికుల‌కు ఏం చేస్తామ‌న్నారో అవ‌న్నీ పోస్ట‌ర్ల రూపంలో అంటించండి. వాల్ రైటింగ్‌లు రాయించండి.. మూడో ఏడాది పాల‌న ఇంత మోసం చేశార‌ని చెప్పి కార్మికుల్లోకి తీసుకెళ్లాలని బాల్క సుమ‌న్ చెప్పారు.

డిజిట‌ల్ మెంబ‌ర్‌షిప్ చేయండి..

పార్టీ మెంబ‌ర్‌షిప్‌తో పాటు విద్యార్థి విభాగం మెంబ‌ర్‌షిప్ కూడా చేయ‌బోతున్నాం. మీరు కూడా ఒక యాప్ త‌యారు చేసుకోండి.. డిజిట‌ల్ మెంబ‌ర్‌షిప్ చేయండి. కార్మికుల‌ను ఎంగేజ్ చేసుకోవ‌చ్చు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుందని బాల్క సుమ‌న్ అన్నారు.

Advertisement
Advertisement