Karne Prabhaker | ఎలక్షన్ కమిషన్.. ప్రభుత్వానికి తొత్తుగా మారుతోందా..? : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
Karne Prabhaker | రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తొత్తుగా మారుతోందా..? అని ఎలక్షన్ కమిషన్‌ను నిలదీసినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు.
Karne Prabhaker | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తొత్తుగా మారుతోందా..? అని ఎలక్షన్ కమిషన్‌ను నిలదీసినట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నాయకులు కర్నె ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు కే కిశోర్ గౌడ్, కురువ విజయ్ కుమార్ కలిశారు.
ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై, కోర్టులపై గౌరవం లేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారు. మేం గెలిచిన చోట్ల ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గాలకు పాల్పడుతుంది. ఇబ్రహీంపట్నంలో 13 సీట్లు గెలిచాం.. కాంగ్రెస్ ఏడు మాత్రమే గెలిచింది.. దాన్నీ దుర్మార్గంగా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. క్యాతననపల్లిలో కూడా మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను అరెస్టు చేసి అరాచకాలు సృష్టించింది. అక్రమ కేసులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని కర్నె ప్రభాకర్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారా అని ఎలక్షన్ కమిషన్‌ను అడిగాం. మూడు వారాల్లో ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో.. రెండు చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. దాన్ని త్వరగా అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరాం. ప్రజాస్వామ్యం పట్ల మాకు గౌరవం ఉంది. 2023 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు కేసీఆర్ వెంటనే ప్రగతిభవన్‌ణు వీడారు.. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండటంతోనే అలా వ్యవహరించారు అని కర్నె ప్రభాకర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



