త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TRS vs BRS | టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ అభ్యంత‌రం.. ఈసీకి ఫిర్యాదు

TRS vs BRS | క‌ల్వ‌కుంట్ల క‌విత ఏర్పాటు చేసిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్)పై భార‌త రాష్ట్ర స‌మ‌తి(బీఆర్ఎస్) తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

S

Telangana | Published On Jun 11, 2026, 6.25 pm IST

TRS vs BRS | టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ అభ్యంత‌రం.. ఈసీకి ఫిర్యాదు
Advertisement

TRS vs BRS | త్రినేత్ర‌.న్యూస్ : క‌ల్వ‌కుంట్ల క‌విత ఏర్పాటు చేసిన తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్)పై భార‌త రాష్ట్ర స‌మ‌తి(బీఆర్ఎస్) తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. టీఆర్‌ఎస్‌ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని ఈసీఐని బీఆర్ఎస్ కోరింది. ఇప్పటికీ ప్రజలు బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తిస్తారని తెలిపింది. ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని విజ్ఞప్తి చేసింది. టీఆర్‌ఎస్‌ పేరుపై ఈసీఐకి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. కవిత పార్టీపై అభ్యంతరాలు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో సూచించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement