Chiranjeevi | చిరంజీవి సినిమాలో అలా వైకుంఠపురములో బ్యూటీ – జెట్ స్పీడ్‌లో మెగా 158 షూటింగ్
మెగా 158 మూవీపై సూపర్ అప్‌డేట్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. స్పెషల్ ఫొటోలను రిలీజ్ చేశారు. ఈ ఫొటోల్లో చిరంజీవి, అనస్వర రాజన్‌తో పాటు నివేదా థామస్ కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Entertainment | Published On Jun 11, 2026, 7.03 pm IST
Chiranjeevi | వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. జెట్ స్పీడ్‌లో మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు.
బుధవారంతో...
ఇటీవలే మెగా 158 షూటింగ్ పొల్లాచ్చిలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్, నివేదా థామస్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు డైరెక్టర్. బుధవారం నాటితో పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ ఫొటోలను చిత్రయూనిట్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో చిరంజీవితో పాటు నివేదా థామస్, అనస్వర రాజన్ కనిపిస్తోన్నారు.
నివేదా థామస్ రీఎంట్రీ....
చిరంజీవి మూవీతోనే నివేదా థామస్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఫొటోల్లో చీరకట్టులో డీ గ్లామర్ లుక్‌లో నివేద కనిపిస్తోంది. ఆమె రోల్ ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శాండల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ – మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
జూన్ 6, 2026

Malayalam Heroine | చిరంజీవి సినిమా నుంచి మలయాళ బ్యూటీ ఔట్ – ఒప్పుకొని… తప్పుకోవడంపై అనుమానాలు?
జూన్ 4, 2026

Chiranjeevi | తండ్రిగా గర్వపడుతున్నా – రామ్‌చరణ్ పెద్దిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Samantha | మా ఇంటి బంగారం సెన్సార్ రివ్యూ - బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ - యాక్షన్ సీన్లు అదుర్స్
- ●PM Modi NITI Aayog Meet | ప్రపంచం ఆందోళనలో ఉన్నా.. భారత్ మాత్రం దూసుకెళ్తోంది : నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
- ●MP Dharmapuri Arvind | కింద మీద చేస్తం.. బీజేపీ ప్రభుత్వం తెస్తం : ఎంపీ ధర్మపురి
- ●Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- ●OTT | ఈ సారి మరింత బోల్డ్ - నలుగురు హాట్ హీరోయిన్లు నటించిన తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Samantha | మా ఇంటి బంగారం సెన్సార్ రివ్యూ - బాషా రేంజ్ ఫ్లాష్‌బ్యాక్ - యాక్షన్ సీన్లు అదుర్స్

PM Modi NITI Aayog Meet | ప్రపంచం ఆందోళనలో ఉన్నా.. భారత్ మాత్రం దూసుకెళ్తోంది : నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

MP Dharmapuri Arvind | కింద మీద చేస్తం.. బీజేపీ ప్రభుత్వం తెస్తం : ఎంపీ ధర్మపురి

Revanth Reddy | హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్లివ్వండి: సీఎం రేవంత్ రెడ్డి



