త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Dharmapuri Arvind | కింద మీద చేస్తం.. బీజేపీ ప్ర‌భుత్వం తెస్తం : ఎంపీ ధ‌ర్మ‌పురి

MP Dharmapuri Arvind | తెలంగాణ‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా బీజేపీని అధికారంలోకి తెస్తామ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ధీమా వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Jun 11, 2026, 7.00 pm IST

MP Dharmapuri Arvind | కింద మీద చేస్తం.. బీజేపీ ప్ర‌భుత్వం తెస్తం : ఎంపీ ధ‌ర్మ‌పురి
Advertisement

MP Dharmapuri Arvind | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా బీజేపీని అధికారంలోకి తెస్తామ‌ని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ధీమా వ్య‌క్తం చేశారు. నిజామాబాద్‌లో ధ‌ర్మ‌పురి అర‌వింద్ మీడియాతో మాట్లాడారు.

2029లో జ‌ర‌గ‌బోయే సాధార‌ణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 23 మెజార్టీతో తెలంగాణ బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్త‌ది. భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ స్థానాలను కూడా కైవ‌సం చేసుకుంటాం. అత్య‌ధిక అసెంబ్లీ సీట్లు కూడా కైవ‌సం చేసుకుంటాం. రాజ‌కీయం చేస్తం. ఎల‌క్ష‌నీరింగ్ చేస్తం. బెంగాల్‌లో చేసింది చేస్తం. ఢిల్లీలో చేసింది చేస్తం. ఆకాశం కింద ఏమేమి చేస్తామో లీగ‌ల్‌గా అన్ని చేస్తం. కింద‌మీద చేస్తం.. ప్ర‌భుత్వం తెస్తం. నా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 2018 ఎన్నిక‌ల్లో కంటే 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించాం. క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే మ‌రిన్ని సీట్లు సాధిస్తాం. ఆరు నెల‌ల నుంచి సంవ‌త్స‌ర కాలంలోనే బీజేపీ కొత్త వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్త‌ది తెలంగాణ‌లో అని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement