KP Vivekananda | బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం బీఆర్ఎస్ ఘనతే: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
KP Vivekananda | బాచుపల్లి ఫైఓవర్ నిర్మాణం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని బీఆర్ఎస్ శాసనసభా పక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు.
త్రినేత్ర.న్యూస్: బాచుపల్లి ఫైఓవర్ నిర్మాణం పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని బీఆర్ఎస్ శాసనసభా పక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తమ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పనులను సైతం ప్రారంభించలేదని మండిపడ్డారు. సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధి బాచుపల్లి చౌరస్తాలో నూతనంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌ను వివేకానంద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టారు.

‘బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణంతోపాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, అలసత్వాన్ని అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రశ్నించినందుకే ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన కొట్లాడి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్.
ఎక్కడో ఉండి ప్రారంభించడం ఏంటి?
ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద శంకుస్థాపనలు చేసి ఎక్కడో మియాపూర్‌లో ఉండి బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమే. ఎస్ఎన్‌డీపీ, ఎస్ఆర్‌డీపీ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు హెచ్ - సిటీ అంటూ పేరు మార్చడం తప్ప చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు సుచిత్ర - కొంపల్లి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయలేకపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం నెపాన్ని నెట్టివేసి చేతులు దోచుకుంటున్నారే తప్ప చేసిందేమీ లేదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తన ఊహల నగరమైన ఫోర్త్ సిటీని ప్రచారం చేస్తూ ఉన్న నగరాన్ని విస్మరిస్తోంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం’ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష అని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
- ●Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ
- ●Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?
- ●Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..
- ●Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు
- ●Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
- ●ITR | ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..

Nithya Menen | మెగా ఫోన్ పట్టనున్న నిత్యా మీనన్ - థ్రిల్లర్ కథతో డెబ్యూ మూవీ

Toll Tax | టోల్ ఫ్రీకి బ్రేక్.. ఇక ప్రభుత్వ అధికారులు కూడా టోల్ చెల్లించాల్సిందే..?

Hyderabad Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన కారుమేఘాలు.. దంచికొడుతున్న భారీ వర్షం..

Tenant Farmers Report | యూరియా రాదు.. పంట కొనరు





