త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | సోద‌రీ సోద‌రుల అనుబంధం అజ‌రామరం : కేసీఆర్

KCR | సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

S

Telangana | Published On Aug 27, 2026, 9.05 pm IST

KCR | సోద‌రీ సోద‌రుల అనుబంధం అజ‌రామరం : కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మానవ సంబంధాలలో అత్యంత గొప్పదైన బంధం సహోదరత్వమని తెలిపారు. అక్కా తమ్ముళ్ళు, అన్నాచెల్లెళ్ల‌ అనుబంధం అజరామరమని అన్నారు.

సహోదరత్వానికి ప్రతీకగా నిలిచిన రాఖీ బంధన్ పర్వదినం, భారత కుటుంబ జీవనంలో ప్రత్యేక సంప్రదాయ, సాంస్కృతిక వేడుకగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ద్వేషం, స్వార్థం వీడి, దేశ ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించడం ద్వారానే వసుదైక కుటుంబ భావన పరిఢవిల్లుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement