త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Breezer | రాష్ట్రంలో బ్రీజర్ల కొరత.. మూడు నెల‌లుగా నిలిచిన‌ స‌ర‌ఫ‌రా!

Breezer | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేసవిలోకాలంలో ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రీజర్లకు (Breezer) ఇప్పుడు క‌ట‌క‌ట ఏర్ప‌డింది. ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌లానుకునే మద్యంప్రియులు చాలావరకు తక్కువ ఆల్కహాల్‌తోపాటు రూ. 130కే దొరికే బ్రీజర్లనే ఎక్కువగా సేవిస్తుంటారు.

G

Telangana | Published On Mar 23, 2026, 8.50 am IST

Breezer | రాష్ట్రంలో బ్రీజర్ల కొరత.. మూడు నెల‌లుగా నిలిచిన‌ స‌ర‌ఫ‌రా!
Advertisement

Breezer | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. వేసవిలోకాలంలో ఎక్కువగా అమ్మకాలు జరిగే బ్రీజర్లకు (Breezer) ఇప్పుడు క‌ట‌క‌ట ఏర్ప‌డింది. ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌లానుకునే మద్యంప్రియులు చాలావరకు తక్కువ ఆల్కహాల్‌తోపాటు రూ. 130కే దొరికే బ్రీజర్లనే ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే రెండు మూడు నెలల నుంచి మద్యం దుకాణాల్లో బ్రీజర్లు దొరకడంలేదు. అయితే రూ.210 ధర ఉన్న బ్రీజర్లు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో అదనంగా ఒక్కో బాటిల్‌కు రూ.70 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని మద్యంప్రియులు వాపోతున్నారు.

వేసవిలో ఒక్కో మద్యం షాపు నుంచి కనీసం 50 కేసుల బ్రీజర్ల అమ్మకాలు జ‌రుగుతుంటాయి. దాదాపు రెండు నెలల నుంచి బ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో ధర ఎక్కువున్న వాటిని కొనుగోలు చేయలేక వినియోగదారులు వెనుదిరుగుతున్నారని వైన్ షాపుల య‌జ‌మానులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రీజర్లతోపాటు మరికొన్ని బ్రాండ్ల మద్యం కూడా రావడం లేద‌ని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలే కాక అర్బన్‌, నగరాల్లో కూడా ఈ బ్రీజర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నదని వినియోగదారులు వాపోతున్నారు.

మ‌రోవైపు రాష్ట్రంలో బీర్ల కొర‌త కూడా ఏర్ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల కార‌ణంగా ఈ వేసవిలో బీర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్‌ కంపెనీలకు సింగూరు నుంచి అందే నీటి సరఫరా ఆగిపోనుంది. నీటి వనరులు లేకపోవడంతో బీర్ల ఉత్పత్తి భారీగా పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రతిరోజూ 44 లక్షల లీటర్ల నీరు సింగూరు జలమండలి నుంచి బీరు ఫ్యాక్టరీలకు సరఫరా అవుతోంది. మరమ్మతుల కారణంగా ఈ నీటి సరఫరా నిలిచిపోతే, బీర్ల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు సంగారెడ్డి పట్టణంలో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement