త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRAOU | అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ ప‌రీక్ష‌లు వాయిదా.. మ‌ళ్లీ ఎప్ప‌ట్నుంచంటే..?

BRAOU | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ( BRAOU ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Feb 3, 2026, 8.35 am IST

BRAOU | అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ ప‌రీక్ష‌లు వాయిదా.. మ‌ళ్లీ ఎప్ప‌ట్నుంచంటే..?
Advertisement

BRAOU | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ( BRAOU ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 11న మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ నేప‌థ్యంలో.. డిగ్రీ మూడో, రెండో, మొద‌టి సంవ‌త్స‌ర వేర్వేరు సెమిస్ట‌ర్ల ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల‌ను తిరిగి ఫిబ్ర‌వ‌రి 17 నుంచి మార్చి 10వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. హాల్ టికెట్లను పరీక్షకు 3 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

 

Advertisement
Advertisement