Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం
Somasila | ఎగువన భారీ వర్షాలతో కృష్ణా నది (Krishna River) జలకళను సంతరించుకున్నది. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో (Somasila) మళ్లీ విహార వేడుక అందుబాటులోకి వచ్చింది.
Somasila | త్రినేత్ర.న్యూస్: ఎగువన భారీ వర్షాలతో కృష్ణా నది (Krishna River) జలకళను సంతరించుకున్నది. దీంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో (Somasila) మళ్లీ విహార వేడుక అందుబాటులోకి వచ్చింది. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేయడంతోపాటు కృష్ణానదిలో నీటి మట్టం స్థిరంగా మారడంతో అధికారులు బోటింగ్ సేవలను పునఃప్రారంభించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ పెరగడంతో స్పీడ్‌బోట్లు, మినీలాంచీలో విహరించేలా బోటింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

వేసవి కాలంలో కృష్ణానదిలో నీటి మట్టం పడిపోవడంతో పర్యాటక శాఖ అధికారులు బోటింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరాయి. దీంతో నదిలో నీటి లభ్యత పుష్కలంగా పెరగడంతో సోమశిల వద్ద మళ్లీ బోటింగ్ నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు బోటింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన కృష్ణానది ప్రవాహం మధ్య బోటింగ్ చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. మరిన్ని వివరాలకు 77027 58566, 82814 12734 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

పర్యాటకులను ఆకర్షించేందుకు..
సోమశిల వద్ద దాదాపు 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.10 కోట్లతో పనులు చేపట్టారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంబిక అమ్మవారు కొలువైన శ్రీలలితాంబిక సోమేశ్వర ఆలయ ఆవరణలో భక్తులు, పర్యాటకుల కోసం విశ్రాంతి భవనాలు, హెలీటూరిజం కోసం హెలిప్యాడ్లు, వాటర్‌ఫ్రంట్ టూరిజం, లగ్జరీ హోటళ్లు, వినోద వేదికలు, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలు, ఆధునిక పర్యాటక మౌలిక వసతులను కల్పించనుంది.

సంబంధిత వార్తలు

Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
ఆగస్టు 10, 2026

Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి
ఆగస్టు 7, 2026

Sangameshwara Temple | కృష్ణానదికి పోటెత్తిన వరద.. సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసం.. ఫొటోలు
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..
- ●Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
- ●AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
- ●Horoscope | ఆగస్టు 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్పులు ఉండవచ్చు!
- ●Free Online Education | ఆన్లైన్లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి

Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..

Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్



