Nitin Nabin | తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్.. మూడు రోజులు రాష్ట్రంలోనే నితిన్ నబీన్
Nitin Nabin | రాష్ట్రంలో (Telangana) పార్టీ బలోపేతంపై బీజేపీ (BJP) అధిష్టానం దృష్టిసారించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయ లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. పార్టీని బూత్ స్థాయి నుంచి విస్తరించేందుకు ప్రణాళిలకలు రచిస్తున్నది.
Nitin Nabin | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో (Telangana) పార్టీ బలోపేతంపై బీజేపీ (BJP) అధిష్టానం దృష్టిసారించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయ లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. పార్టీని బూత్ స్థాయి నుంచి విస్తరించేందుకు ప్రణాళిలకలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. త్వరలో జరగబోయే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బూత్‌స్థాయి నేతలతో సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తారు.
నబీన్ పర్యటన ఇలా..
- ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు.
- రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 10 జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
- అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొంటారు.
- పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
- ఈనెల 29న ఉదయం వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్ కాన్ క్లేవ్‌లో పాల్గొంటారు.
- వరంగల్‌లో లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ తదితర ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
- అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్లతో నిర్వహించే భేటీలో పాల్గొంటారు.
- 30న ఘట్‌కేసర్‌లో జరిగే స్టేట్ వర్కింగ్ కమిటీ, ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరవుతారు.
తాజావార్తలు
- ●Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు
- ●Austria Vs Algeria | ఆస్ట్రియాను గట్టెక్కించిన సాషా
- ●Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్
- ●Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్
- ●పోర్చుగల్-కొలంబియా మ్యాచ్ డ్రా
- ●Forest Officer | జింకకు పోహా తినిపించిన అటవీ అధికారి.. సస్పెండ్.. వీడియో

Kesineni Nani | హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న విజయవాడ ఎంపీ.. సీఎం రేవంత్‌కు కేశినేని నాని ఫిర్యాదు

Austria Vs Algeria | ఆస్ట్రియాను గట్టెక్కించిన సాషా

Eatala Rajender | ప్రభుత్వ భూముల పేరుతో పేదల ఇండ్లు కూల్చివేస్తున్న హైడ్రా: ఎంపీ ఈటల రాజేందర్

Argentina vs Jordan | అర్జెంటినా హ్యాట్రిక్






