Eatala Rajender | ఆర్టీసీ గురించి ఆనాడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే పనిచేస్తోంది : ఈటల రాజేందర్
Eatala Rajender | ఆర్టీసీ కార్మికులు అనేక సమరశీల పోరాటాలు చేశారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు.
Eatala Rajender | ఆర్టీసీ కార్మికులు అనేక సమరశీల పోరాటాలు చేశారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. కానీ అవేవీ ఫలించలేదన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తారని భావించారన్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు నేడు సమ్మెకు దిగినట్లు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను హస్తం పార్టీ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 60 వేల ఉద్యోగులతో కళకళలాడిన ఆర్టీసీ.. ఇప్పుడు 38వేల మంది ఉద్యోగులకే పరిమితం అయ్యిందన్నారు. ఇలానే ఉంటే ఇంకో పదేళ్లలో ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఖతం పట్టించి.. ప్రైవేటుపరం చేస్తారని ధ్వజమెత్తారు.
పట్టణాల్లో కాలుష్యం ఉండకూడదని ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఇందులోభాగంగా ట్యాక్సులను కూడా రద్దు చేసినట్లు గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. అందులో పనిచేసే సిబ్బందిని కూడా ప్రైవేటు వారినే నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని.. ఎలక్ట్రిక్ బస్సులను కూడా సంస్థే నడిపించాలని ఈటల డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పనుల వల్ల ఆర్టీసీ అప్పులపాలవుతోందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్‌సీ బకాయిలుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు కేసీఆర్ కూడా సంఘాలు ఎందుకు..? సమ్మెలు ఎందుకు..? అని ఆర్టీసీ గురించి నంగనాచి మాటలు మాట్లాడారని వ్యాఖ్యానించారు. అప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే పనే చేస్తోందని దుయ్యబట్టారు.
Also Read..
ఆర్టీసీ సమ్మె వేళ జగ్గారెడ్డి సంచలన ప్రకటన.. అధికారంలో ఒక మాట, ప్రతిపక్షంలో ఒక మాట తగదంటూ చురకలు!
గవర్నమెంట్ ఫ్రీ పుస్తకాలు ఇస్తుంటే.. ప్రైవేట్ స్కూళ్లలో అంత ధరలెందుకు
ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర : కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాద్
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






