NHRC | గవర్నమెంట్ ఫ్రీ పుస్తకాలు ఇస్తుంటే.. ప్రైవేట్ స్కూళ్లలో అంత ధరలెందుకు
NHRC | స్కూల్ బ్యాగుల (School Bags) బరువు తగ్గించాల్సింది పోయి బండెడు పుస్తకాలు కొనాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం ఎంత వరకు సమంజసం. ఒకవైపు ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తూ ఉంటే.. ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) మాత్రం వేల రూపాయల ధరలు పెట్టి పుస్తకాలు ఎందుకు కొనాలి? ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రచురిస్తున్న పుస్తకాలే ఉచితంగా ఇస్తున్నప్పుడు మరి ప్రైవేటువి ఎందుకు కొనాలి? అసలు జాతీయ విద్యా విధానం (NPE) మార్గదర్శకాలు అమలవుతున్నాయా? .. అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం (NHRC) వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసు(Notice) లు పంపింది.
-
ప్రైవేట్ స్కూళ్లలో ఆ స్కూల్ పుస్తకాలే ఎందుకు కొనాలి?
-
ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎందుకు చదవకూడదు
-
గవర్నమెంట్ ఫ్రీ పుస్తకాలు ఇస్తుంటే... అవి ఎందుకివ్వరు?
-
జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలకు ఇది విరుద్ధం కాదా?
-
స్కూల్ బ్యాగ్ బరువు ఎందుకు తగ్గించరు
-
వెంటనే నివేదిక ఇవ్వండి
-
అన్ని రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం
NHRC | 2026-27 విద్యా సంవత్సరం మొదలవకముందే ప్రైవేటు పాఠశాలల్లో (private schools) పుస్తకాల (textbooks) దందా మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించి, ప్రైవేట్ పబ్లిషర్లకు చెందిన ఖరీదైన పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. ఈ విషయంపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్‌హెచ్ఆర్‌సీ.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి తెచ్చి, అధిక ధరలు కలిగిన ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నాయని వివిధ ప్రాంతాల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారు. NCERT పాఠ్యపుస్తకాలతో పోలిస్తే, ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలు చాలా ఖరీదైనవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది అందరికీ సమానమైన, సమగ్రమైన విద్యను అందించాలనే జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను దెబ్బతీస్తోందని, ఆర్‌టీఈ చట్టం 2009లోని సెక్షన్ 29ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు, ప్రైవేటు యాజమాన్యాల తీరు కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోందని వాపోయారు.
తల్లిదండ్రుల ఫిర్యాదును NHRC సభ్యుడు ప్రియాంక్ కానూన్గో అధ్యక్షతన కూడిన బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించే దిశగా అమలు చేస్తున్న జాతీయ పాఠశాల బ్యాగుల విధానం గురించి ఆరా తీసింది. విద్యా హక్కు చట్టం (RTE) సెక్షన్ 29లో నిర్దేశించిన నిబంధనల ప్రకారం పాఠ్యాంశాల అమలు తీరుపై వివరణ కోరింది. SCERT ప్రచురిస్తున్న పుస్తకాల సంఖ్య ఎంత? ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఇవి అందుబాటులో ఉన్నాయా? అనే సమాచారం ఇవ్వాల్సిందిగా విద్యాశాఖను ఆదేశించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు SCERT/NCERT పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నప్పుడు, ప్రైవేట్ పాఠశాలలు కూడా అదే నాణ్యమైన పుస్తకాలను నిర్ణీత రుసుము ప్రాతిపదికన ఎందుకు అమలు చేయడం లేదని కమిషన్ ప్రశ్నించింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం (National School Bag Policy) ప్రకారం.. విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించాలని, అనవసరమైన ప్రైవేట్ పబ్లికేషన్స్ పుస్తకాలను రుద్దకూడదని తెలిపింది. ఈ నిబంధనలను చాలా పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని ఆదేశించింది.
స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాఠశాల ఆవరణలోనే లేదా నిర్ణీత దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలనే నిబంధనలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ప్రైవేటు పాఠశాలల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది. విద్యా హక్కు చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. మరోవైపు, విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం పాఠశాల సిలబస్, పాఠ్యపుస్తకాలను నిర్ణయించడంలో NCERT, SCERTల పాత్రపై వివరణ ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కమిషన్ కోరింది. అలాగే, ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాలను సూచించే అధికారం పరీక్షా బోర్డులకు ఉందో లేదో కూడా స్పష్టం చేయాలని స్పష్టం చేసింది. గడువులోపు నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
Also Read..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు - ఓటేసిన సెలిబ్రిటీలు
ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర : కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాద్
తిరుమలలో ప్రియురాలితో జయం రవి - ఓటు వేయకుండా రావడంపై నెటిజన్ల ట్రోలింగ్
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






