RTC Strike | ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర : కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాద్
RTC Strike | రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాద్ (Deviprasad) పేర్కొన్నారు.
RTC Strike | రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాలు రోడ్లపైకి వస్తున్నాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీ ప్రసాద్ (Deviprasad) పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు (RTC Strike) కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. వాటిని అమలు చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుంచి సమ్మెకు (RTC Strike) దిగినట్లు చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్( KCR ) హయంలో ఆగస్టు 2023లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, అప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో నిర్ణయం అపాయింటెడ్ డే రాలేదని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. మొత్తం 32 డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చారన్నారు. విధి లేని పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
ఎమర్జెన్సీ రోజులు..
సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు నైపుణ్యం లేని డ్రైవర్లను తాత్కాలికంగా నియమించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిన్న తాత్కాలిక డ్రైవర్ నిర్వాకంతో 38 మంది ప్రయాణికులు గాయపడినట్లు చెప్పారు. తాండూరులో పోలీసులు జారీ చేసిన హెచ్చరిక దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో పోలీసులు ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇస్తే కేసులు పెడతామని బెదిరిండం ఏంటని ప్రశ్నించారు.
వారందరినీ జైల్లో పెడతారా..?
ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నాయని.. వారందరినీ జైల్లో పెడతారా..? అంటూ ప్రశ్నించారు. సమ్మెపై బీజేపీ గోడ మీద పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలకు అదో ఫ్యాషన్ అయిపోయింది..
ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక హరీష్ రావు ఉన్నారని పొన్నం ప్రభాకర్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఆర్టీసీ కార్మికులకే కాదు సమస్యల్లో ఉన్న వారికి ఎవరికైనా మద్దతు ఇస్తారని వివరించారు. హరీష్ రావును ప్రతీ విషయంలోకి లాగి విమర్శించడం కాంగ్రెస్ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లతో సమ్మె చేస్తున్న వారికి తమ నైతిక మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసింది కేసీఆర్ మాత్రమే
కేసీఆర్ హయాంలో ఆర్టీసీ మహిళా కార్మికులు రాత్రి 8 లోపే విధులు ముగించుకొని వెళ్లిపోయే వెసులుబాటు ఉండేదని చెప్పారు. అయతే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో మహిళా కార్మికులను రాత్రి 11 దాటిన తర్వాత కూడా విధుల్లో ఉండాలని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతోపాటూ పీఆర్‌సీ అమలు చేసిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసింది కేసీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు..
కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు పథకానికి రూ.9వేల కోట్లు కేటాయించామని ప్రభుత్వం గొప్పగా చెబుతోందని విమర్శించారు. మరి అంత డబ్బు కేటాయిస్తే.. కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని నిలదీశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు..
కాళేశ్వరం విషయంలో ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతోనైనా రేవంత్ ప్రభుత్వం తన వక్రబుద్దిని మార్చుకోవాలని సూచించారు. కాళేశ్వరంపై ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో డిండి ప్రాజెక్టుపై జిల్లాల మధ్య తగువు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారమే డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Also Read..
టార్గెట్లు కాదు.. కస్టమర్ల భద్రతే ముఖ్యం!!
ఎల్లుండి కవిత కొత్త పార్టీ.. తెలంగాణ ప్రజా జాగృతి కోసం దరఖాస్తు
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



