త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | 15 గంట‌లు చ‌ర్చించాం.. సంబరాలు జ‌ర‌పండి: పొన్నం పిలుపు

Ponnam Prabhakar | ఆర్టీసీ(RTC) కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని.. ఈ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాల‌పై ఆర్టీసీ కార్మికుల‌తో క‌లిసి సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని ర‌వాణా శాఖా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. రెండు రోజుల సమ్మె(Strike)లోనే ఆర్టీసీ కార్మికులతో జరిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయని చెప్పారు.

S

News | Published On Apr 25, 2026, 4.52 pm IST

Ponnam Prabhakar | 15 గంట‌లు చ‌ర్చించాం.. సంబరాలు జ‌ర‌పండి: పొన్నం పిలుపు
Advertisement
  • ఆర్టీసీ కార్మికులు మ‌న కుటుంబ స‌భ్యులు
  • శంక‌ర్‌గౌడ్ కుటుంబానికి అండ‌గా ఉంటాం
  • ఆర్టీసీ విలీనానికి అంగీక‌రించాం
  • ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌థ‌కాల‌ అమ‌లును వివ‌రించండి
  • ప్ర‌జాప్ర‌తినిధుల జూమ్ మీటింగ్‌లో పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపు

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ(RTC) కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని.. ఈ చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాల‌పై ఆర్టీసీ కార్మికుల‌తో క‌లిసి సంబ‌రాలు నిర్వ‌హించాల‌ని ర‌వాణా శాఖా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ (Congress) పార్టీ డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, అధికార ప్రతినిధులతో ఆయ‌న శనివారం జూమ్ సమావేశం నిర్వ‌హించారు. రెండు రోజుల సమ్మె(Strike)లోనే ఆర్టీసీ కార్మికులతో జరిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయని చెప్పారు. వారి చిరకాల స్వప్నం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారితో పార్టీ క్యాడర్ కార్యక్రమాల్లో పాల్గొనాలని పొన్నం సూచించారు.

మిగ‌తా స‌మ‌స్య‌లనూ ప‌రిష్క‌రిస్తున్నం...

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రుల బృందం సుమారు 15 గంటలు చర్చించి వారి సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరమింపజేశాం. ఆర్టీసీ కార్మికుల అంశాలపై ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ మొత్తం పాల్గొని సంబరాలు నిర్వహించాలి. వారి ప్రధాన డిమాండ్స్ కు ప్రభుత్వం అంగీకరించింది. అందులో ఆర్టీసీ విలీనం చేయడానికి అంగీకరించాం. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం. ఉద్యోగులకు 11 శాతం పీఆర్సీ ప్రకటన చేశాం. మిగతా ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తున్నాం.

వారు మ‌న కుటుంబ స‌భ్యులు..

గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 30 మందికి పైగా మరణించారు. కార్మికులతో మనకు శతృత్వం లేదు. వారు మన కుటుంబ సభ్యులు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. బండి సంజయ్ శవ రాజకీయాలు చేయడం సరైంది కాదు. సమ్మె సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యవహరించిన తీరు మంచిది కాదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ఆర్టీసీ సమ్మె విరమణపై ప్రభుత్వం తీసుకున్న చొరవపై కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహించాలి.

పార్టీ ఎజెండాగా తీసుకొని..

పార్టీ ఎజెండాగా తీసుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లు, అధికార ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలి. మనం అమ‌లు చేస్తున్న హామీల‌ను ప్రజల్లోకి వెళ్లి వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు 2013 బాండ్స్, 2017 పీఆర్సీ, డీఏలు ప్రకటన, సీసీఎస్‌, పీఎఫ్‌ బకాయిలు చెల్లించడం, కొత్త బస్సులు కొనుగోలు, ఉద్యోగాల నియామకాలు, కారుణ్య నియామకాలు, సర్వీసు నుంచి తొలగించిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాం. రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. పేద ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల‌ కోసం ఆర్టీసీ లైఫ్ లైన్ లాగా పని చేస్తుంది అని పొన్నం వివ‌రించారు.

 

Advertisement
Advertisement