KTR | తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు : కేటీఆర్
KTR | తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడు లైంగిక దాడి చేశాడని మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారం రోజుల దాకా ఎవరు రాయలేదు అని ప్రశ్నించారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగేది అని తెలిపారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడు లైంగిక దాడి చేశాడని మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారం రోజుల దాకా ఎవరు రాయలేదు అని ప్రశ్నించారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగేది అని తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన నవ తెలంగాణ 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మీడియా స్వేచ్ఛ అన్నారు.. మరి ఏ మీడియా..? ప్రింట్ మీడియానా..? ఎలక్ట్రానిక్ మీడియానా..? డిజిటల్ మీడియానా..? ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛ అంటే పత్రికల స్వేచ్ఛ మాత్రమే కాదు. టీవీల స్వేచ్ఛ మాత్రమే కాదు. సోషల్ మీడియా, వ్యక్తుల స్వేచ్ఛ మాత్రమే కాదు. సంప్రదాయ మీడియాని, మీ స్వేచ్ఛని ఎలా కబళించాలో, ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. మీ అందరికీ ఎన్డీటీవీ టేక్ ఓవర్ కథ తెలుసు కదా.. ఒకప్పుడు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ గారు పెట్టారు. 2017లో వారి మీద సీబీఐ, ఈడీ వచ్చి పడ్డాయ్. ఏడేండ్లు ఇన్విస్టిగేషన్ జరిగింది. 2024లో ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. ఏమీ లేదు అంత బాగానే ఉందని. ఈ ఏడేళ్ల మధ్యలో ఓ కుబేరుడు వచ్చాడు.. ఆ సంస్థను కొనుక్కున్నాడు.. రికవరీ అయిపోయింది. అనుకున్న కార్యం నెరవేరింది నిర్విఘ్నంగా.. దేశంలో ఉన్న పరిస్థితి ఇది అని కేటీఆర్ తెలిపారు.
పరిశోధనాత్మక జర్నలిజం ఎక్కడుంది..?
వాస్తవం ఏంటి.. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్న మాట వాస్తవం. ఈ రోజు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ ఎవరికో ఒకరికి వత్తాసుగా మారిపోయాయి. న్యూట్రల్‌గా లేదు మీడియా. ఇది ఫ్యాక్ట్. తెలంగాణనే తీసుకోండి.. ఎన్నో సందర్భాల్లో వార్తను వార్తగా రాయలేని పరిస్థితి లేదా..? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది. కేంద్ర మంత్రి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడని ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రాసింది.. వారం రోజులు ఎందుకు మౌనంగా ఉంది..? సోషల్ మీడియానే లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా..? లగచర్లలో అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే ఏ మీడియా ప్రశ్నించింది..? పరిశోధనాత్మక జర్నలిజం ఎక్కడుంది..? ఈ మాట అంటే నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నా.. ఇన్విగేస్టివ్ జర్నలిజం ఉందా..? ఇన్విస్టిగేషన్ జర్నలిజం మొదలుపెడితే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి.. టెలీగ్రాఫ్ యాక్ట్‌కు అమెండ్‌మెంట్‌లు వస్తాయి. టెలీ కమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తుంది.. కేంద్రం తీసుకువస్తుంది. మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా హేట్ స్పీచ్ బిల్లు వస్తుంది. యస్.. హేట్ స్పీచ్ బిల్లు షుడ్ స్టార్ట్స్ విత్ పీపుల్ అండ్ గవర్నమెంట్.. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్‌లు ఇవ్వడం. మీరు మీ భాషను నియంత్రణలో పెట్టుకుంటే తర్వాత ఇతరులను అనొచ్చు. అప్పుడు హేట్ స్పీచ్ అనే మాట అనొచ్చు. మేం మాత్రం అంటాం.. ఇతరులు అంటే మంచిది కాదనే భావన సరికాదు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
అందులో బూతులు కూడా లేవు.. 15 రోజులు జైల్లో పెట్టారు..
కొత్తగా సెన్సార్‌లు కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఢిల్లీలో జరిగిన ఆందోళన పోస్టులు, రీల్స్ అన్నింటినీ తీసేస్తున్నారు. బెదిరించి ఆ పనిని నిరాంటకంగా చేస్తున్నారు. చివరకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్స్ కూడా ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్లిపోయే పరిస్థితి. ఇక్కడితో ఆగడం లేదు.. నిజాలు నిర్భయంగా చెబితే జైల్లో పెడుతున్నారు. మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు.. అందులో బూతులు కూడా లేవు.. 15 రోజులు జైల్లో పెట్టారు.. ఇది స్వేచ్ఛ హరించడం కాదా..? ఆ కేసు తర్వాత ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్‌లు పెట్టి అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పింది. ఇది రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చేస్తున్న పని. ఇది ఎవరు చేసినా తప్పు తప్పే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
- ●ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు
- ●Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్
- ●Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్
- ●V Hanumantha Rao | అయోధ్య విరాళాల చోరీ.. గాంధీ భవన్లో వీహెచ్ వినూత్న నిరసన
- ●KTR | అపొజిషన్ బాగుంది మహేశన్నా : కేటీఆర్

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..

ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు

Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్

Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్




