Nayanthara | టాక్సిక్ కోసం ఇంగ్లీష్‌లో డబ్బింగ్ – నయన్ రూటే సఫరేటు
యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీ ఆగస్ట్ 26న థియేటర్లలోకి రాబోతుంది. కన్నడంలో పాటు ఇంగ్లీష్‌లో ఏకకాలంలో ఈ సినిమాను షూట్ చేశారు. కాగా టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం నయనతార సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు తగ్గట్లుగానే ఆమె డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది.
Nayanthara | యశ్ హీరోగా నటించిన టాక్సిక్ (Toxic)మూవీ కోసం పాన్ ఇండియన్ వైడ్‌గా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీతో(Kiara Advani) పాటు హ్యుమా ఖురేషి, తారా సుతారియా కథానాయికలుగా కనిపించబోతున్నారు.
ఇంగ్లీష్‌లో...
ఆగస్ట్ 26న టాక్సిక్ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాను కన్నడంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్‌లో రిలీజ్ కానున్న ఫస్ట్ కన్నడ మూవీగా టాక్సిక్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది.
పదహారేళ్ల తర్వాత...
టాక్సిక్‌తో దాదాపు పదహారేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సాండల్‌వుడ్‌లోకి నయనతార రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా కోసం ఈ మలయాళ ముద్దుగుమ్మ సొంతంగా ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన హీరోయిన్లు అరువు గళాలపై ఆధారపడితే నయన్ మాత్రం తన పాత్రకు తానే ఇంగ్లీష్‌తో పాటు కన్నడంలో సొంతంగా డబ్బింగ్ చెప్పేసిందని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు తగ్గట్లుగానే ఆమె డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్స్ అద్భుతంగా కుదిరినట్లు టాక్. కన్నడంలో నయన్ డబ్బింగ్ చెప్పిన మొదటి మూవీ కూడా టాక్సిక్ కావడం గమనార్హం.
పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్
టాక్సిక్‌లో గంగా అనే పాత్రలో నయన్ కనిపించబోతుంది. నెగెటివ్ టచ్‌తో యాక్షన్ ప్రధానంగా ఈ బ్యూటీ రోల్ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ కోసం నయనతార పన్నెండు కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. కియారా అద్వానీ పదిహేను కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పారితోషికం విషయంలో కియారా తర్వాత నయన్ సెకండ్ ప్లేస్‌లో నిలిచినట్లు చెబుతోన్నారు.
టాక్సిక్ పది రోజుల ముందు నయనతార హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ హాయ్ థియేటర్లలోకి రాబోతుంది. ఆగస్ట్ 14న విడుదలవుతోన్న ఈ సినిమాకు నయన్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rukmini Vasanth | క్లాప్‌బోర్డ్‌తో రుక్మిణి వసంత్ – మలయాళంలో తొలి అడుగు
ఆగస్టు 11, 2026

Kiara Advani | టాక్సిక్ తర్వాత టాలీవుడ్ – మైథాలజీ మూవీలో కియారా అద్వానీ – రౌడీ బాయ్‌తో రొమాన్స్
ఆగస్టు 10, 2026

Nayanthara | టాక్సిక్ కోసం పదేళ్ల రూల్ బ్రేక్ – నయనతారను ట్రోల్ చేస్తున్న కోలీవుడ్ ఫ్యాన్స్
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



