Harish Rao | బిడ్డా అఖిలా.. నువ్ డాక్టర్ అవ్వు.. నేనున్నా
Harish Rao | హరీశ్‌రావు.. ఇదొక పేరు కాదు, ప్రజలకు నమ్మకం.. భరోసా. కష్టంలో ముందుండే చేయి.. పేదోడి కన్నీళ్లను తుడిచే మనసు ఆయన సొంతం. మాటల కంటే చేతలతో ప్రజల హృదయాలను గెలిచి నిరూపించిన నేత. ఒక అన్నగా, నాయకుడిగా, ఆత్మబంధువుగా పేరెళ్లిన ఆపద్భాందవుడు. ఇప్పటికే ఓ పేదింటి బిడ్డను ఇంటర్ వరకు చదివించి నేడు అదే విద్యార్థి వైద్య విద్య బాధ్యతను మరోమారు భుజానికేసుకున్నాడు.
- ఎంబీబీఎస్ సీటెక్కడొచ్చినా ఫీజు కట్టి చదివిస్తా
- ఇప్పటికే తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివించిన మాజీ మంత్రి
- తండ్రి చనిపోయిన నిరుపేద బిడ్డకు మరోమారు అభయం
- ఇంటికి పిలిచి అన్నం పెట్టి ఆత్మీయ భరోసా కల్పించిన ఆపద్భాందవుడు
- పెద్దదిక్కుగా నిలిచి మరోసారి మానవత్వం చాటిన హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్: హరీశ్‌రావు.. ఇదొక పేరు కాదు, ప్రజలకు నమ్మకం.. భరోసా. కష్టంలో ముందుండే చేయి.. పేదోడి కన్నీళ్లను తుడిచే మనసు ఆయన సొంతం. మాటల కంటే చేతలతో ప్రజల హృదయాలను గెలిచి నిరూపించిన నేత. ఒక అన్నగా, నాయకుడిగా, ఆత్మబంధువుగా పేరెళ్లిన ఆపద్భాందవుడు. తనకు తానే సాటి అని ఎన్నోమార్లు నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఓ పేదింటి బిడ్డను ఇంటర్ వరకు చదివించి నేడు అదే విద్యార్థి వైద్య విద్య బాధ్యతను మరోమారు భుజానికేసుకున్నాడు. సిద్దిపేటకు చెందిన అఖిల డాక్టర్ చదువు బాధ్యతంగా తనదేనని చెప్పి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

సిద్దిపేట పట్టణానికి చెందిన మద్దూరి రాజు రెండో కూతురు అఖిల ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 720 మార్కులకు 453 మార్కులు సాధించింది. తండ్రి మరణించగా తల్లి హోటల్‌లో పని చేస్తోంది. మంచి కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత అడ్డుగా నిలిచింది. ఎంబీబీఎస్ చేయడం ఎలా అని ఆందోళనలో ఉన్న సమయంలో హరీశ్‌రావు ఇంటికి పిలిచి కడుపునిండా అన్నం పెట్టి వెన్ను తట్టారు. నువ్ డాక్టర్ అవ్వు.. నీ వైద్య విద్య ఫీజు మొత్తం నేన్ భరిస్తా అని అఖిలకు అభయమిచ్చారు. ఇప్పటికే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివించిన హరీశ్ రావు మరోసారి అఖిల చదువు బాధ్యతలు తీసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అఖిల కుటుంబ నేపథ్యం..
సిద్దిపేట పట్టణానికి చెందిన మద్దూరి రాజు సిద్దిపేటలో బజరంగ్ అల్లం టీ హోటల్‌ను ఏళ్లుగా నడిపించాడు. దురదృష్టవశాత్తు బ్రెయిన్ క్యాన్సర్‌తో విధి వక్రీకరించి కాలం చేశాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన భార్య, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్యకు బాధ్యతలు ఎక్కువై ఆర్థికంగా భారమైంది. పిల్లల్ని ఎలా చదివించాలనే ఆందోళన ఓవైపు.. మరోవైపు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో తల్లి దిక్కుతోచని స్థితిలో పడింది. అలాంటి సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి వారి పరిస్థితి వివరించి సహాయం చేయలని కోరారు. అడిగిన వెంటనే వారికి డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇప్పించారు. పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకొని భరోసానిచ్చారు.

ప్రస్తుతం పెద్ద కూతరు కావ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. అప్పటికే రెండో కూతరు అఖిల మెరిడియన్ స్కూల్‌లో చదువుతుంది. మంచి ప్రతిభ గల విద్యార్థి. ఆ విద్యార్థికి సరస్వతి అనుగ్రహం ఉంది. కానీ.. లక్ష్మీ కటాక్షం లేదనే ఆందోళనలో ఉండగా హరీశ్‌రావును ఆశ్రయించారు. స్కూల్ యాజమాన్యంకి ఫోన్ చేసి చెప్పారు. 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తి అయ్యే వరకు ఫీజు బాధ్యతలు నెరవేర్చారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం కూడా సహకారం అందించారు. చిన్న కూతరు దీపికను కూడా చదివిస్తానని హరీష్ రావు భరోసా నిచ్చారు.
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?





