Gattu Ramachander Rao | తాంత్రిక విద్యలతో ఆ ముగ్గురిని మట్టుబెట్టాలని చూస్తున్నావా..?
Gattu Ramachander Rao | రాష్ట్రంలో వర్షాలు పడకుండా, కరువు ఏర్పడేలా మాజీ మంత్రి హరీశ్‌రావు తాంత్రిక విద్యలు చేస్తున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు నువ్వే.. కాంగ్రెస్‌లో పార్టీ కీలకమైన ఆ ముగ్గురు నేతలను మట్టుబెట్టాలని తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకు అమెరికా పోయి ఉంటావని అద్దంకి దయాకర్‌ను ఉద్దేశించి గట్టు రామచందర్ రావు అన్నారు.
దయాకర్‌కు పదవి రాగానే అహం పెరిగింది
హోం బీం ఫట్ అంటే అధికారాలు మారిపోతాయా..?
రేవంత్ రెడ్డి బీజేపీకి కావాల్సిన వాడట..
కాంగ్రెస్‌లో రేవంత్‌కు 80 శాతం వ్యతిరేకం
సీఎం అవుట్ డేటేడ్ లీడర్
అర నిమిషంలో 60 తిట్లు తిడుతా..
అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు తేడా తెలియదు
అద్దంకి దయాకర్‌కు గట్టు రామచందర్ రావు కౌంటర్
Gattu Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో వర్షాలు పడకుండా, కరువు ఏర్పడేలా మాజీ మంత్రి హరీశ్‌రావు తాంత్రిక విద్యలు చేస్తున్నారన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు నువ్వే.. కాంగ్రెస్‌లో పార్టీ కీలకమైన ఆ ముగ్గురు నేతలను మట్టుబెట్టాలని తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకు అమెరికా పోయి ఉంటావని అద్దంకి దయాకర్‌ను ఉద్దేశించి గట్టు రామచందర్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం గట్టు రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అమెరికా నుంచి హరీష్ రావు మీద అనవసరపు కూతలు కుశారు. అద్దంకి దయాకర్ నాకు కూడా మంచి ఫ్రెండే. చదువుకున్న వాడు. చదువు చెప్పేటోడు.. ఆయన మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండే. ఇంత ఘోరంగా ఎందుకు తయారైండో అర్థం కావడం లేదు. దయాకర్‌కు పదవి రాగానే అహం పెరిగింది. కేబినెట్ హోదా రాగానే ఇలాంటి లక్షణాలు వస్తాయా..? ఈ మధ్య అతను మాట్లాడిన మాటలు.. కొద్ది నిమిషాలు తిరిగి గుర్తు చేసుకుంటే అతను కూడా అస్యహించుకునే విధంగా ఉన్నాయి. రేవంత్ పక్కన చేరగానే దయాకర్‌కు జ్ఞానం పోయింది అని గట్టు ధ్వజమెత్తారు.
తెలంగాణ రావడానికి తాంత్రిక విద్యలు చేయొచ్చు కదా..?
ఆయన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే.. హరీశ్‌రావు అట.. అధికారానికి దూరమై.. తాంత్రిక విద్యలు చేస్తుండట.. అదేంటంటే వర్షాలు పడకుండా.. వర్షాలు పడకుండా ఉంటే గవర్నమెంట్ మీద వ్యతిరేక వస్తదట.. వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తది కాబట్టి తాంత్రిక విద్యలు చేస్తున్నడట. మరి నువ్వు కూడా ఉద్యమకారుడిని అని చెప్పుకుంటవ్ కదా..? ఉద్యమంలో దెబ్బలు తిని, జైళ్లకు పోయి నిరంతరం అరెస్టులయి దెబ్బలు తిన్న హరీశ్‌రావు, నీవు కలిసి తెలంగాణ రావడానికి తాంత్రిక విద్యలు చేయొచ్చు కదా..? సిగ్గు ఉండాలి కదా భాష మాట్లాడితే. తాంత్రిక విద్యలు ఏంటి..? హోం బీం ఫట్ అంటే అధికారాలు మారిపోతాయా..? అని రామచందర్ రావు మండిపడ్డారు.
సంఘ్‌ను బలోపేతం చేసేందుకు రేవంత్ కృషి
బీజేపీ ఎంపీ దూబే మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాకు మంచి దోస్తు. ఏబీవీపీలో కలిపి పని చేశాం. ఆయన సంఘ్‌ను బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నడు.. సాటుమాటుగా మాట్లాడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి బీజేపీకి కావాల్సిన వాడు అని. ఈ మాటలు స్వయంగా బీజేపీ ఎంపీ అంటే.. కాంగ్రెస్‌లో కథ ముగిసినట్టే అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నరు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. రేవంత్ మంచి పాలన చూసి ఈ తాంత్రిక విద్య చేస్తున్నారట. రేవంత్ రెడ్డిది మంచి పాలన అని ఒక ఓటింగ్ పెట్టు.. అది కూడా తెలంగాణ ప్రజలందరిలో అక్కర్లేదు.. మీ కాంగ్రెస్ పార్టీలోనే ఓటింగ్ పెట్టు. 80 శాతం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాకపోతే రాజకీయాలు మానేస్తా. కేవలం కేబినెట్ హోదా వచ్చినవారే రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని గట్టు రామచందర్ రావు తెలిపారు.
మిగిలిన రెండేండ్లలో మిగిలే ముఖ్యమంత్రి కూడా కాదు
తమిళనాడులోని తిరుచ్చిలో, అక్కడి పుణ్యక్షేత్రాల్లో తాంత్రిక విద్యలు చేశారట హరీశ్‌రావు. అక్కడి పుణ్యక్షేత్రాలు తాంత్రిక విద్యలు చేసేటివా..? అంటే తమిళనాడు ప్రజలను కూడా అవమానపరుస్తావా..? తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నవ్. ఏంటి..? నువ్వు ఏం కోరుకుంటున్నవ్.. రేవంత్ రెడ్డి అంటే వీరుడు శూరుడు అనుకుంటున్నవా..? రేవంత్ రెడ్డి ఒక అవుట్ డేటేడ్ లీడర్. మిగిలిన రెండేండ్లలో మిగిలే ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన. కాంగ్రెస్‌ను ఖతం పెట్టింనచిన సీఎం, కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి. అలాంటి సీఎంను మీరు వీరుడు శూరుడు అని చెప్పినంతా మాత్రాన మిమ్మల్ని మెచ్చుకోరు. బూతులు తిడితే మీరు పెద్దోళ్లు అవుతారని అనుకుంటున్నారా..? తిట్టిన తిట్టకుండా అర నిమిషంలో 60 తిట్లు తిడుతా.. అది సంస్కారమా.. హౌలే అని పదం వాడితే నువ్వు హౌలే అయి ఉండాలి అని అద్దంకికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు గట్టు రామచందర్ రావు.
అధికారం కోసం ఈ పదేండ్లలో కాంగ్రెస్ చేసింది చేతబడులేనా..?
కాంగ్రెస్ పార్టీలో నీకు తాంత్రిక విద్యలే నేర్పారా..? మోదీని గద్దె దింపాలని రాహుల్ గాంధీ తాంత్రిక విద్యలు చేస్తున్నారా..? అధికారం కోసం ఈ పదేండ్లలో కాంగ్రెస్ చేసింది చేతబడులేనా..? రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు ఆ తప్పును ఎదుటివారి మీద ప్రచారం చేస్తడు. చంద్రబాబుకు ఆ అలవాటు ఉంది. ఆ స్కూల్ నుంచి వచ్చినవాడు రేవంత్ రెడ్డి కాబట్టి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పు చేసే ప్రయత్నం. జనరల్‌గా రేవంత్ రెడ్డి ఒప్పందాలన్నీ విదేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు అద్దంకి దయాకర్‌ను అమెరికాకు పంపించావు అంటే అక్కడ తాంత్రిక విద్యలు చేయడం కోసమే పంపించావా..? అమెరికాలో తాంత్రిక విద్యలు చేసే వారితో ఒప్పందానికి పంపించావా..? రేవంత్ రెడ్డి నిన్ను అమెరికా పంపించి మాట్లాడిస్తున్నాడంటే కాంగ్రెస్‌లో రేవంత్ పదవికి ఎసరుబెట్టబోతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్కను ఇలాంటి తాంత్రిక విద్యలు చేసి మట్టుబెట్టాలని చూస్తున్నావా..? నీకు రేవంత్ రెడ్డే పంపించి ఉంటాడు.. అక్కడ ఒప్పందం చేసుకుని, రేవంత్‌కు పోటీ ఉన్న అందరి మీద తాంత్రిక విద్యలు చేస్తున్నావా..? బట్ట కాల్చి మీద వేస్తున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థం. ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడానికికే నిన్ను రేవంత్ అమెరికా పంపించి ఉంటడు. ఇక్కడ మాట్లాడకుండా అమెరికా పోయి ఎందుకు మాట్లాడుతున్నవ్ అని అద్దంకి దయాకర్‌ను రామచందర్ రావు నిలదీశారు.
లీగల్‌గా కూడా చర్యలు తీసుకుంటాం..
మీ తిట్లకు భయపడి హరీశ్‌రావు అలా ఇలా ఉంటారని అనుకుంటున్నావా..? ఇక్కడ కూర్చోని నీటిపారుదల గురించి అనర్గళంగా చెప్పగల నాయకుడు హరీశ్‌రావు. అగ్రికల్చర్, హార్టికల్చర్‌కు తేడా సీఎంకు, నీకు తెలియదు.. అలాంటి వ్యక్తివి నీవు.. నీళ్లు, కరువు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నవ్.. లీగల్‌గా కూడా చర్యలు తీసుకుంటాం. అద్దంకి బూతుల చిట్టా చాలా ఉంది. అన్నిటికీ తగిన రీతిలో బదులిస్తాం అని గట్టు రామచందర్ రావు ఘాటుగా బదులిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



