Rashmika Mandanna | అఫీషియల్ : ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – తెలుగులో రిలీజ్
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ కాక్ టెయిల్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఆగస్ట్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ బాలీవుడ్ మూవీలో రష్మిక మందన్నతో పాటు మరో హీరోయిన్‌గా కృతి సనన్ నటించింది.
Entertainment | Published On Aug 2, 2026, 3.01 pm IST
Rashmika Mandanna | రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 ఓటీటీ రిలీజ్‌డేట్ అఫీషియల్‌గా ఖరారైంది. షాహిద్‌కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన్నతో పాటు కృతి సనన్ హీరోయిన్లుగా నటించారు. దీపికా పడుకోణ్ కథానాయికగా 2012లో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కాక్ టెయిల్‌కు సీక్వెల్‌గా ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రూపొందింది. హోమీ అద్జానియా దర్శకత్వం వహించాడు.
ఆగస్ట్ 14న...
కాక్ టెయిల్ 2 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
కాక్ టెయిల్ 2 థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినా కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. 110 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 140 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచింది.
బోల్డ్ రోల్‌లో...
కాక్ టెయిల్ 2 రిలీజ్‌కు ముందు రష్మిక మందన్న పాత్ర అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ బోల్డ్ రోల్‌లో ఈ బ్యూటీ కనిపించడంపై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో జోరుగానే డిస్కషన్స్ నడిచాయి. కానీ రిలీజ్ తర్వాత మాత్రం రష్మిక క్యారెక్టర్‌పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. మోడ్రన్‌గా సాగే ఈ రోల్ రష్మికకు అస్సలు సెట్టవ్వలేదని, ఆమెను ఎంపిక చేసి మేకర్స్ తప్పుచేశారంటూ ఆడియెన్స్ విమర్శించారు. కృతి సనన్‌ను హైలైట్ చేయడానికి రష్మిక మందన్న రోల్ ప్రాముఖ్యతతో పాటు లెంగ్త్‌ను కావాలనే తగ్గించినట్లు పుకార్లు షికారు చేశారు. ఈ విమర్శలతో హర్టయిన రష్మిక రిలీజ్ తర్వాత ప్రమోషన్స్‌కు దూరమైంది.
కునాల్, దియా....మధ్యలో యాలీ...
కునాల్‌తో ప్రేమలో పడుతుంది దియా. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లిచేసుకోవాలని అనుకుంటారు. పెళ్లికి కొద్ది రోజులు ఉందనగా కునాల్ లైఫ్‌లోకి అనుకోకుండా దియా ప్రాణ స్నేహితురాలు యాలీ ఎంటరవుతుంది. దియాతో కునాల్ పెళ్లి ఫిక్సయ్యిందని తెలిసి కూడా అతడి వెంటపడుతుంది యాలీ. కునాల్‌ను యాలీ ఇష్టపడుతుందని తెలిసి దియా ఏం చేసింది. దియా, యాలీలలో కునాల్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Tamannaah | హారర్ మూవీ షూటింగ్లో భయపడ్డ మిల్కీ బ్యూటీ – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఆగస్టు 8, 2026

Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాకు మించిన బడ్జెట్‌తో…
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



