Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ – స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు అల్లు అర్జున్ ప్రాణ స్నేహితులు నలుగురు సహనిర్మాతలుగా వ్యవహరించబోతున్నట్లు వెల్లడించారు.
Entertainment | Published On Aug 2, 2026, 3.54 pm IST
ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీలైంది. ఈ సినిమాతో తన నలుగురు స్నేహితులను బన్నీ సహనిర్మాతలుగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో రాకా పేరుతో సైంటిఫిక్ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు బన్నీ. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. అట్లీ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ ఓ సూపర్ హీరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
23వ మూవీ...
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. లోకేష్ కనగరాజ్ సినిమాల స్టైల్‌లోనే మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం హంగులతో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో సూపర్ హీరోగా బన్నీ రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 23వ మూవీ ఇది.
స్కూల్ ఫ్రెండ్స్..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు బన్నీ నలుగురు స్నేహితులు సహనిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా అత్యున్నత స్థానానికి ఎదిగినా స్నేహానికి, స్నేహితులకు అతడు ఇచ్చే విలువలో మార్పు రాలేదని అతడి సన్నిహితులు చెబుతుంటారు. ఆ స్నేహాన్ని నమ్మి తన నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్‌కు సహనిర్మాతలుగా బన్నీ ఛాన్స్ ఇచ్చాడు. బన్నీ వాస్‌తో పాటు అల్లు అర్జున్ స్కూల్ ఫ్రెండ్స్ సందీప్ రామినేని, నటరాజ్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి లోకేష్ కనగరాజ్‌తో చేస్తోన్న సినిమాకు కో ప్రొడ్యూసర్స్‌గా పనిచేస్తున్నారు.
మొదటిసారి కాదు...
తాను ఒక్కడే ఎదగడం కాకుండా తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా ఎదగాలని బన్నీ కోరుకుంటారనడానికి ఇదే నిదర్శనమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతోన్నాయి. అల్లు అర్జున్ సన్నిహితులకు అవకాశాలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. పుష్ప ది రైజ్ సినిమాలో బన్నీ బంధువులు ముత్తంశెట్టి మీడియా పేరుతో భాగమయ్యారు. అలాగే బన్నీ స్నేహితులైన ఎస్‌కేఎన్, శరత్‌లు ఇప్పటికే సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా రాణిస్తున్నారు
సంబంధిత వార్తలు

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 13, 2026

Megha Akash | ఒకే సారి ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాష్ రెండు తెలుగు సినిమాలు
ఆగస్టు 13, 2026

Janhvi Kapoor | నో గ్లామర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ – దీపికా, రష్మికలకు ధీటుగా!
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!



