MLA Rakesh Reddy | ‘ఇప్ప సారా’కు ‘ఇందిరమ్మ’ పేరు మాత్రం పెట్టకండి.. సభలో బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు
MLA Rakesh Reddy | ఒకవేళ రాష్ట్రంలో ఇప్ప సారా బ్రాండ్ అమలు చేస్తే.. ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సెటైర్లు వేశారు. శాసనసభలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పసారాపై లేవనెత్తిన అంశాలపై రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
MLA Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్ : ఒకవేళ రాష్ట్రంలో ఇప్ప సారా బ్రాండ్ అమలు చేస్తే.. ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సెటైర్లు వేశారు. శాసనసభలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్పసారాపై లేవనెత్తిన అంశాలపై రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేవనెత్తిన అంశం ఉత్తర తెలంగాణకు ఉపయోగకరం. కల్తీ కల్లు వేలాది మందిని అస్థిపంజరల్లాగా తయారు చేస్తుంది. అల్ఫ్రాజోలంతో కూడిన కల్లు తాగి పిచ్చోళ్ల మాదిరి తయారవుతున్నారు ఆవేదనతో రాకేశ్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంట్ చేశారు.
మీరు దొరలు విష్కీ తాగి ఉండొచ్చు.. మేం రైతు బిడ్డలం.. మా ఊర్ల చుట్టు అంతా చాలా మంది ఇప్పసారా తాగేవారు. ఇప్పసారా మీద నవ్వుతున్నారంటే మీకు దాని విలువ తెలియదు. మా తాతలు ఆరడుగుల ఎత్తులో ఉండి.. ఇప్పసారా తాగి 100 ఏండ్లు బతికారు. అది కల్తీసారా కాదు.. ఇది ఆర్గానిక్ విష్కీ. ప్రపచంలో 130 దేశాలు సేవిస్తున్నాయి. అడవిలో దొరికే ఇప్పపువ్వుపై రన్నింగ్ కామెంట్ చేయొద్దు.. రాష్ట్రానికి ఉపయోగపడే అంశం ఇది. కల్లు తాగి పిచ్చోళ్లు అవుతున్నారు. కిడ్నీలు, గుండెలు పోతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. భార్యా బిడ్డలు అనాథలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయాయి. కాబట్టి ఇప్పసారాను ప్రమోట్ చేస్తే గిరిజనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
కల్తీ కల్లు వల్ల చాలా ప్రాబ్లం ఉంది. చనిపోతున్నారు. ప్రభుత్వ సీరియస్‌గా ఆలోచించాలి. ఇప్పసారా అంటే నవ్వులాట కాదు.. ఆదాయం పెంచుతుంది. ప్రపంచం గురించి తెలుసుకుని మాట్లాడండి.. అది ఇప్పసారా లేదా టకీలా అయి ఉండొచ్చు.. దాన్ని బ్రాండ్ తయారు చేసి ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి.. ఏదైనా మంచి పేరు పెట్టకుందాం అని రాకేశ్ రెడ్డి సూచించారు.
సంబంధిత వార్తలు

MLA Anirudh Reddy | రక్షణ సేన కాదది.. ‘రాక్షస’ సేన: టీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమర్శలు
మే 5, 2026

MLA Anirudh Reddy | మళ్లీ తిరగబడే రోజులు వస్తాయి.. ఆంధ్రా వ్యాపారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక
ఏప్రిల్ 3, 2026

MLA Anirudh Reddy | 90 రోజులకో సారి డ్రగ్ టెస్టు చేసుకోవాలి.. లేదంటే డ్రగ్స్ తీసుకున్నట్టే : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మార్చి 31, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



