త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | 13 కోట్ల మంది ఓట్లు ఇంకా పూర్తిగా తొల‌గించ‌లేదు : రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | స‌ర్( SIR ) ప్ర‌క్రియ‌పై కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు( Ramachander Rao ) మండిప‌డ్డారు. స‌ర్‌పై కాంగ్రెస్ చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తిప్పికొట్టాల‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

S

Telangana | Published On Oct 10, 2026, 4.32 pm IST

Ramachander Rao | 13 కోట్ల మంది ఓట్లు ఇంకా పూర్తిగా తొల‌గించ‌లేదు : రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : స‌ర్( SIR ) ప్ర‌క్రియ‌పై కాంగ్రెస్ పార్టీ( Congress Party ) నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు( Ramachander Rao ) మండిప‌డ్డారు. స‌ర్‌పై కాంగ్రెస్ చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో తిప్పికొట్టాల‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. శ‌నివారం బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ నేత‌లు, ఆల్ సెల్స్ క‌న్వీన‌ర్లు, అధికార ప్ర‌తినిధులు, మీడియా ప్యాన‌లిస్టుల‌తో రామ‌చంద‌ర్ రావు స‌మావేశ‌మై ప‌లు సూచ‌న‌లు చేశారు.

అన్ని రకాల విచారణల తర్వాతే ఓటు తొలగిస్తారని, 13 కోట్ల మంది ఓట్లు ఇంకా పూర్తిగా తొలగించలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 13 కోట్లలో 2.89 కోట్ల ఓట్లు డూప్లికేషన్‌వి అన్న ఆయన, ఫామ్‌-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఓటు ఇస్తున్నారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించిందని వెల్లడించారు.

బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు. వరుస ఎన్నికల ఓటములతో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ ప్రచారాన్ని ఎండగట్టాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement