Ramachander Rao | రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ బెదిరిస్తుండు : రామచందర్ రావు
Ramachander Rao | దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ గాంధీ( Rahul Gandhi ) బెదిరిస్తుండు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు( Ramachander Rao ) మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది అని నిప్పులు చెరిగారు.
Ramachander Rao | త్రినేత్ర న్యూస్ : దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను రాహుల్ గాంధీ( Rahul Gandhi ) బెదిరిస్తుండు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు( Ramachander Rao ) మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది అని నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో రామచందర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, ఈసీ మీద రాజకీయాలకు అతీతంగా విశ్వాసంగా ఉండాలి. సీజేఐ అపాయింట్‌మెంట్ అడిగి రాజకీయ మెమోరాండం ఇస్తామంటే అది ఎంత వరకు సబబో ఆలోచించాలి. న్యాయవాదులు పిటిషన్లు వేస్తారన్న విషయం కూడా రాహుల్ గాంధీకి తెలియదంటే ఆశ్చర్యకంగా అనిపిస్తుంది. రామజన్మభూమిని వ్యతిరేకించిన లాయర్లందరూ ఆయన పక్కనే ఉన్నారు. ఆయనకు సలహాల ఇస్తున్నారా లేదా తెలియదు. ఈ దేశంలో హింస జరగాలి అని యుద్ధం ప్రకటించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని రామచందర్ రావు మండిపడ్డారు.
భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ చేస్తున్న దిగజారుడు పోస్టులు అత్యంత గర్హనీయం. రాజ్యాంగ వ్యవస్థలంటే కాంగ్రెస్‌కు ఏమాత్రం గౌరవం లేదు. సుప్రీంకోర్టు సీజేఐపై సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థపై బురదజల్లడమే కాంగ్రెస్ నైజం అని రామచందర్ రావు నిప్పులు చెరిగారు.
తాజావార్తలు
- ●Nandan Nilekani NEET Paper Leak Reforms | పరీక్ష రోజే చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్.. AIతో లీకేజీలకు ఫుల్స్టాప్
- ●Piyush Goyal | కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’
- ●Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క
- ●Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి
- ●Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1,109 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Amit Shah BIMSTEC Meeting | ఏ దేశంపైనా దాడి చేయడం మా సిద్ధాంతం కాదు

Nandan Nilekani NEET Paper Leak Reforms | పరీక్ష రోజే చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్.. AIతో లీకేజీలకు ఫుల్స్టాప్

Piyush Goyal | కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీయే అతిపెద్ద ‘రెడ్ ఫ్లాగ్’

Dussehra Gift for FTE Employees | ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక: మంత్రి సీతక్క

Tripti Dimri | బోల్డ్ బయోపిక్‌లో త్రిప్తి డిమ్రి





