N Ramachander Rao | తెలంగాణలోనూ యూనిఫాం సివిల్ కోడ్ : ఎన్ రామచందర్ రావు
N Ramachander Rao | దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయాలన్న లక్ష్యంతో తీసుకువస్తున్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను తెలంగాణలోనూ తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పేర్కొన్నారు.
N Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయాలన్న లక్ష్యంతో తీసుకువస్తున్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను తెలంగాణలోనూ తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ మహాభియాన్ కార్యక్రమంలో రామచందర్ రావు పాల్గొని ప్రసంగించారు.
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, గుజరాత్ ఈ చట్టాన్ని అమలు చేస్తుండగా, నిన్న అసోం అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది మన సిద్ధాంతం, మన మేనిఫెస్టోలో భాగంగా ఉంది. అదే విధంగా ఆర్టికల్ 370 రద్దు చేయాలని కూడా మన సిద్ధాంతంలో ఉండే.. రద్దు చేసినం. ఈ ఆర్టికల్ వల్ల నష్టం ఏంటో కూడా మనం గతంలో చెప్పినం. ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఎందుకు రావాలో ప్రజలకు చెప్పాలి. తెలంగాణలో కూడా యూనిఫాం సివిల్ కోడ్ రావాలి. ఇది దేశానికి అవసరం. యూసీసీ అనగానే చాలా మంది ఒక మతానికో, ఒక వర్గానికో వ్యతిరేకం అనుకుంటారు. అసోం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం.. దాన్ని స్వాగతించాలి. ఈ కోడ్ వల్ల ఈ దేశంలో ఉన్న మహిళలకు, చిన్నారులకు లభించే హక్కులకు న్యాయం జరుగుతుంది అని ఆయన తెలిపారు.
కొన్ని మతాల్లో మహిళలకు హక్కుల్లేవు. ఈ కోడ్ దేశ వ్యాప్తంగా అమల్లోకి వస్తే మహిళలకు హక్కులు వస్తాయి. పిల్లలకు ఒకే చట్టం రాబోతుంది. ఈ కోడ్ వల్ల రాబోయే రోజుల్లో అన్ని మతాలకు, కులాలకు, వర్గాలకు మేలు జరుగుతుంది.. షెడ్యూల్ తెగలకు తప్ప. దేశంలోని ముస్లిం మహిళలు కూడా ఈ కోడ్‌ను స్వాగతించారు అని రామచందర్ రావు గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

N Ramachander Rao | తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం : ఎన్ రామచందర్ రావు
మే 28, 2026

Pinarayi Vijayan ED Raids | పినరయి విజయన్‌పై ఈడీ ఫోకస్ వెనుక అసలు కథ ఇదేనా? కాంగ్రెస్, బీజేపీలపై సీపీఎం సంచలన ఆరోపణలు!
మే 28, 2026

Uttamkumar Reddy | హామీ ఇస్తున్నాం.. ప్రతి గింజనూ కొంటాం: రైతులకు మంత్రి ఉత్తమ్ భరోసా
మే 28, 2026
తాజావార్తలు
- ●Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!
- ●Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే
- ●KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్
- ●Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..
- ●Thirunallar Saneeswara Temple | తిరునల్లార్ శనీశ్వరుని 'స్వర్ణ కాకి వాహనసేవ': ఏలినాటి శని దోషాలు పోవాలంటే దీని విశిష్టత తెలుసుకోండి!
- ●Siddaramaiah | అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేశా : సిద్ధరామయ్య

Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!

Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ - పెళ్లైనే తగ్గేదేలే

KTR | ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది! : కేటీఆర్

Home Loan Rules | హోమ్ లోన్ రూల్స్ మారుతున్నాయి.. ఇక జీతం ఒక్కటే చాలదు..



