Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
Alleti Maheshwar Reddy | ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం రాజ్యాంగానికి, చట్టబద్దమైన పాలనకు దక్కిన విజయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీజేపీ చేసిన న్యాయపోరాటం చివరకు న్యాయాన్ని సాధించింది అని తెలిపారు.
Alleti Maheshwar Reddy | త్రినేత్ర న్యూస్ : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం రాజ్యాంగానికి, చట్టబద్దమైన పాలనకు దక్కిన విజయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీజేపీ చేసిన న్యాయపోరాటం చివరకు న్యాయాన్ని సాధించింది అని తెలిపారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల రేవంత్ రెడ్డికి ఎలాంటి గౌరవం ఉన్నా.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి నిత్యం మాట్లాడే రాహుల్ గాంధీ, మరో పార్టీ టికెట్‌పై ఎన్నికైన ఎమ్మెల్యేకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం ఫిరాయింపుల నిరోధక చట్ట స్ఫూర్తికి ఎలా అనుగుణంగా ఉంటుందో కూడా సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | 'సర్'పై ఎన్నో అనుమానాలు
- ●Enugula Rakesh Reddy | రెండు డీఏలు ఇస్తామని ఉద్యోగులను అవమానించారు
- ●Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..
- ●Rashmika Mandanna | అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా నేషనల్ క్రష్
- ●Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే

Ponnam Prabhakar | 'సర్'పై ఎన్నో అనుమానాలు

Enugula Rakesh Reddy | రెండు డీఏలు ఇస్తామని ఉద్యోగులను అవమానించారు

Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్‌కు చెక్ పెడుతున్న వింత వాహనం

Stock Markets | స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. రూ.5 లక్షల కోట్లు ఆవిరి.. ఆందోళనకర స్థాయిలో అమ్మకాలు..





