త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | ‘భ‌ట్టి’ బ‌డ్జెట్ ‘చీటింగ్’ బ‌డ్జెట్.. ‘ఆశా పాశం’ పాటతో పోల్చిన ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

Alleti Maheshwar Reddy | ఇటీవ‌ల రాష్ట్ర ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా బీజేపీఎల్పీ లీడ‌ర్ ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. భ‌ట్టి బ‌డ్జెట్ చీటింగ్ బ‌డ్జెట్ అని తీవ్రంగా విమర్శించారు. ఈ బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఆశా పాశం అనే పాట గుర్తుకు వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 24, 2026, 1.23 pm IST

Alleti Maheshwar Reddy | ‘భ‌ట్టి’ బ‌డ్జెట్ ‘చీటింగ్’ బ‌డ్జెట్.. ‘ఆశా పాశం’ పాటతో పోల్చిన ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి
Advertisement

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌ల రాష్ట్ర ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా బీజేపీఎల్పీ లీడ‌ర్ ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. భ‌ట్టి బ‌డ్జెట్ చీటింగ్ బ‌డ్జెట్ అని తీవ్రంగా విమర్శించారు. ఈ బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఆశా పాశం అనే పాట గుర్తుకు వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ బ‌డ్జెట్ చూశాక నాకు ఓ పాట గుర్తుకు వ‌స్తుంది. ఆశా పాశం అనే పాట‌లో నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే.. కంచికి నీ కథలే దూరం అన్న‌ట్టు తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఉంది. చీటింగ్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డంతో భ‌ట్టి విక్ర‌మార్క హ్యాట్రిక్ సాధించారు. వ‌రుసగా మూడోసారి అదే మోసపూరిత బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆర్థిక విధ్వంసానికి బాట‌లు వేసే తిరోగ‌మ‌న బ‌డ్జెట్ ఇది. ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల ఎగ‌వేత బ‌డ్జెట్ ఇది. హామీల‌కు నిధులు కేటాయించ‌ని చీటింగ్ బ‌డ్జెట్ ఇది. ఎండ‌మావిగా క‌న‌బ‌డే బ‌డ్జెట్. నిధులు ఉన్న‌ట్టే క‌నిపిస్తాయి కానీ విడుద‌ల కావు. ఖ‌ర్చు జ‌ర‌గ‌దు అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement