త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఘ‌ట‌న రోజు కారులోనే ఆమె తల్లి

Vaishnavi-Haribabu Murdered Case | యూట్యూబ‌ర్‌ వైష్ణవి భర్త హ‌రిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హ‌రిబాబును సంతోష్ చంపుతుంటే వైష్ణవి తల్లి రాణి కారులోనే ఉంద‌ని.. ఆమెతో పాటు పెద్ద‌మ్మ కొడుకులు చ‌ర‌ణ్, రంజిత్ కూడా ఉన్న‌ట్లు పోలీసులు తేల్చారు.

S

Telangana | Published On Sep 20, 2026, 6.28 pm IST

Vaishnavi-Haribabu Murdered Case | వైష్ణవి భర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్..  ఘ‌ట‌న రోజు కారులోనే ఆమె తల్లి
Advertisement

Vaishnavi-Haribabu Murdered Case | త్రినేత్ర‌.న్యూస్‌: యూట్యూబ‌ర్‌ వైష్ణవి భర్త హ‌రిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హ‌రిబాబును సంతోష్ చంపుతుంటే వైష్ణవి తల్లి రాణి కారులోనే ఉంద‌ని.. ఆమెతో పాటు పెద్ద‌మ్మ కొడుకులు చ‌ర‌ణ్, రంజిత్ కూడా ఉన్న‌ట్లు పోలీసులు తేల్చారు. వైష్ణవి తల్లి, ఇద్దరు సోదరుల్ని కూడా నిందితులుగా చేర్చిన‌ట్లు తెలిపారు. హరిబాబును పక్కా ప్ర‌ణాళిక ప్ర‌కారమే హ‌త్య చేశార‌ని ఆదివారం వెల్ల‌డించారు. హ‌త్య జ‌రిగిన రోజు వీరంతా కోరుట్ల నుంచి నిజామాబాద్ వెళ్లార‌ని తెలిపారు. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంతోష్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపింన విష‌యం విదిత‌మే.

యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో నిందితుడు, ఆమె భర్త హరిబాబు గ‌త గురువారం నిజామాబాద్‌ రాజరాజేంద్ర చౌరస్తాలో దారుణ హత్యకు గురయ్యాడు. తన చెల్లి వైష్ణవిని చంపినందుకే ప్రతీకారంగా ఈ హత్య చేశానంటూ ఆమె సోదరుడు మాదాపూర్‌కు చెందిన సంతోష్‌ సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్‌ చేశాడు. ‘నేను ఓ పని నిమిత్తం నిజామాబాద్‌ వచ్చా. అనుకోకుండా హరిబాబు కనిపించడంతో హత్య చేశా’ అని అందులో పేర్కొన్నాడు. హ‌త్య అనంత‌రం రాత్రి కోరుట్ల వెళ్లిన సంతోష్‌ అక్కడి స్టేషన్‌లో లొంగిపోయాడు.

జగిత్యాల జిల్లాకు జిల్లాలోని కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన యూట్యూబర్‌ వైష్ణవి (19)ని కోరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు (24) గతేడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకుని.. అత్తింట్లో కాపురం పెట్టాడు. వైష్ణవి 4నెలల గర్భిణిగా ఉన్న సమయంలో దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్ర‌మంలో వైష్ణ‌విని హ‌రిబాబు హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement