త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekly dose of my Photography | ఈ అడవి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకుపచ్చని ఆకుల సవ్వడి..అవే రంగులు తొడిగిన రామచిలుకల కుహు కుహూల సరాగాలు.. రంగు రంగుల రెక్కలతో సింగారంగా ఎగిరే సీతాకోక చిలుకలు.. ఆకలి తీర్చుకునేందుకు వేటకు బయలుదేరిన మృగాలు.. అడవికే అందాలద్దే బంగారు జింకలు..వాటి ముద్దు గొలిపే చూపులు..ఇవన్నీ జ్ఞాపకాలుగా ఒకే చోట నిక్షిప్తమైతే అంతకు మించిన ప్రకృతి భాండాగారం ఇంకేముంటుంది

G

Telangana | Published On Jun 21, 2026, 11.54 am IST

Weekly dose of my Photography | ఈ అడవి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా

సంక్షిప్త సారాంశం

జోగిన పల్లి సంతోష్ కుమార్ (Santosh Kumar J). ప్రకృతి సంరక్షణలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రకృతే దేవతగా భావించి ప్రకృతి మనుషులు వేర్వేరు కాదనే భావనతో గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే పర్యావరణ ఉద్యమంతో లక్షలాది మందితో కోట్లాది చెట్లు నాటించిన హరిత ప్రేమికుడు. ప్ర‌కృతి,ప‌క్షుల ఫొటోగ్ర‌ఫీపై ప్ర‌త్యేక ఆస‌క్తి క‌లిగిన‌ ఆయన తాను స్వ‌యంగా తీసిన అద్భుత‌మైన చిత్రాల‌ను `వీక్లీ డోస్ ఆఫ్ మై ఫొటోగ్ర‌ఫీ` (My Photography) పేరుతో సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటూ ఉంటారు. ఈ ఆదివారం కూడా ఓ చిత్రాన్ని ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు.

Advertisement

Weekly dose of My Photography | త్రినేత్ర‌.న్యూస్‌:

ప్రకృతే మన దేవత ప్రకృతే మన మొదటి గురువు అంటాడు చాణక్యుడు. ప్రకృతిని గౌరవించలేని వారు తమ జీవితాన్ని తాము గౌరవించుకోలేరు. ప్రకృతితో ప్రతి చెట్టు ఓ జీవితం. ప్రతి పువ్వు ఓ కవిత. ఆ చెట్లపై వాలే ఆ చెట్ల కింద తలదాచుకునే ప్రతి వన్యప్రాణికి ఓ జీవితగాథ ఉంటుంది. అటువంటి గాథల్లో కొన్ని క్షణాలను మనం కెమెరాలో బంధించగలిగితే.. ఆ దృశ్యాలు అజరామరంగా నిలిచిపోతాయి. మాజీ ఎంపీ, పర్యావరణ ప్రేమికుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ స్వయంగా ఒక చక్కటి ఫొటో గ్రాఫర్. ప్రతి ఆదివారం వన్యప్రాంతాలను సందర్శించి ఓపిగ్గా గడిపి రమణీయమైన క్షణాలను లెన్స్ లో బంధిస్తారు. వాటినే ఆయన weekly dose of my photography పేరుతో తన X అకౌంట్ లో షేర్ చేస్తున్నారు.

2026 జూన్ 21న ఆయన తీసిన దృశ్యమిది..

`వన్యప్రాణుల ప్రపంచంలో ఒకే ఒక్క క్షణంలో జరిగిన అద్భుత దృశ్యం ఇది. నా లెన్స్ ద్వారా బంధించిన ప్రకృతిలోని అసలైన నాటకీయ రూపం. ఒక అందమైన పక్షి, దాని చిన్న వేట (ఆహారం). ప్రకృతిలో జరిగే ప్రతి క్షణం కూడా మనుగడ కోసం సాగించే ఒక కథను మనకు గుర్తు చేస్తుంది.` అని పేర్కొన్నారు.

 

గత కొన్ని వారాలుగా ఆయన పంచుకున్న కొన్ని ఆసక్తికర దృశ్యాలు మీ కోసం...

Advertisement
Advertisement