త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క‌లు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త‌న పుట్టినరోజు సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మొక్క‌లు నాటారు.

S

Telangana | Published On Oct 21, 2026, 1.31 pm IST

Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క‌లు నాటిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
Advertisement

Green India Challenge | త్రినేత్ర న్యూస్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా త‌న పుట్టినరోజు సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి మొక్క‌లు నాట‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. మొక్క‌లు నాట‌డం.. వాటిని సంర‌క్షిచండం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతుగా మూడు మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వృక్షాల‌ను కాపాడుకుంటేనే.. మ‌న నియోజ‌క‌వ‌ర్గం కాలుష్య ర‌హితంగా ఉంటుంద‌న్నారు. ఇంత‌టి గొప్ప కార్య‌క్ర‌మం చేప‌ట్టిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement