త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress | గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీల‌కు ఇవ్వండి

Telangana Congress | శాస‌న‌మండ‌లిలో ఖాళీ కానున్న మూడు గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో.. క‌నీసం రెండు స్థానాలైనా బీసీల‌కు ఇవ్వాల‌ని టీ పీసీసీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ లోకేశ్ యాద‌వ్ టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Oct 3, 2026, 4.50 pm IST

Telangana Congress | గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలు.. రెండు సీట్లైనా బీసీల‌కు ఇవ్వండి
Advertisement

Telangana Congress | త్రినేత్ర న్యూస్ : శాస‌న‌మండ‌లిలో ఖాళీ కానున్న మూడు గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో.. క‌నీసం రెండు స్థానాలైనా బీసీల‌కు ఇవ్వాల‌ని టీ పీసీసీ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ లోకేశ్ యాద‌వ్ టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో బీసీ సామాజిక వ‌ర్గం నేత‌లు క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని బీసీ సామాజిక వర్గాలకు గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీలకు అసలు ప్రాతినిధ్యమే లేనందున గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇవ్వాల‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్, పార్టీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. బీసీలకు పార్టీ, నామినేటెడ్ పోస్టులలో 42 శాతం కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీసీ ఆశావాహులు డాక్టర్ లోకేష్ యాదవ్, చరణ్ కౌశిక్, గౌరీ సతీష్, చనగాని దయాకర్, బోధనపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement