త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | సిరిసిల్ల‌కు త‌ర‌లిరండి.. సీఎం స‌భ‌ను స‌క్సెస్ చేయండి

Mahesh Kumar Goud | రేపు సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ప్రజా పాలనకు, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు వేదిక కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్ అన్నారు.

S

Telangana | Published On Sep 29, 2026, 4.01 pm IST

Mahesh Kumar Goud | సిరిసిల్ల‌కు త‌ర‌లిరండి.. సీఎం స‌భ‌ను స‌క్సెస్ చేయండి
Advertisement
  • కాంగ్రెస్ శ్రేణులు, ప్ర‌జ‌ల‌కు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ పిలుపు

Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్: రేపు సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ప్రజా పాలనకు, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు వేదిక కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌ కుటుంబం మొత్తం ఐక్యంగా కదిలి సభను చ‌రిత్రాత్మకంగా విజయవంతం చేయాలన్నారు. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌ర‌లిరావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈమేర‌కు ఆయ‌న‌ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఆయ‌న మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, సామాజిక భద్రత తదితర కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి సిరిసిల్ల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి సభకు ప్రజలను తరలించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మహిళలు, యువత, రైతులు, కార్మికులు, నేతన్నలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement