Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని.. అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు.
- ఖర్గే, రాహుల్ ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట చెబుతున్నా
- శంషాబాద్ ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్: తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా తీసుకుంటామని.. అవసరమైతే లాక్కుంటామని వ్యాఖ్యానించారు. బీసీలది న్యాయమైన కోరిక అని అన్నారు. బీసీలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండగా ఉంటారని చెప్పారు. శంషాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీల హక్కుల కోసం మాట్లాడే ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఘంటాపదంగా చెబుతున్నా. రాహుల్ గాంధీ, ఖర్గే ఇచ్చిన ధైర్యంతో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నా. రాహుల్ భారత్ జోడో యాత్రతో ఎవరు ఎంతో వారికి అంత రాహుల్ గాంధీ నినాదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్‌లను చేశాం. మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చాం.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు. మోదీ, అమిత్ షా దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ము, ధైర్యం దద్దమ్మలకు లేదు. కుల సర్వే సాకారం అయి ఉంటే యావద్దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా ఉండేది. కేంద్ర సర్వేలో 10వ కాలమ్‌లో ఎస్సీ, ఎస్టీ ఇచ్చి ఓబీసీ కాలమ్ ఎత్తేశారు. బీసీ వంచన చేస్తున్న మోదీ. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలి. మోదీ గద్దె దిగే టైం వచ్చింది.
అధికారంలోకి రాగానే కుల సర్వే
రాహుల్ ప్రధాని కావడం తథ్యం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తాం. కులాలను పక్కనపెట్టి బీసీలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమీ లేదు. భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సిన అవసరం. న్యాయమైన కోరిక మనది. మన వాటా మనకు వచ్చే వరకు పోరాడాలి అని మహేశ్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం













