త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FIFA World Cup 2026 | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్.. తెల్లారి 4.30 వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు తెరిచే ఉంటాయ్..

FIFA World Cup 2026 | ఫిఫా వ‌రల్డ్ కప్ అభిమానుల‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ తీపి క‌బురు అందించింది. ఈ క‌బురు వింటే ఎగిరి గంతేయాల‌నిపిస్తుంది. మ‌రి అంత‌టి శుభ‌వార్త ఏంటో తెలుసా.. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ థ‌ర్డ్ ప్లేస్, ఫైనల్ మ్యాచ్ జ‌రిగే రోజుల్లో తెల్ల‌వారుజాము వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు, మైక్రో బ్రూవ‌రీలు తెరిచి ఉంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

S

Telangana | Published On Jul 17, 2026, 4.32 pm IST

FIFA World Cup 2026 | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్.. తెల్లారి 4.30 వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు తెరిచే ఉంటాయ్..
Advertisement

FIFA World Cup 2026 | త్రినేత్ర‌.న్యూస్ : ఫిఫా వ‌రల్డ్ కప్ అభిమానుల‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ తీపి క‌బురు అందించింది. ఈ క‌బురు వింటే ఎగిరి గంతేయాల‌నిపిస్తుంది. మ‌రి అంత‌టి శుభ‌వార్త ఏంటో తెలుసా.. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ థ‌ర్డ్ ప్లేస్, ఫైనల్ మ్యాచ్ జ‌రిగే రోజుల్లో తెల్ల‌వారుజాము వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు, మైక్రో బ్రూవ‌రీలు తెరిచి ఉంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స్టేట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ థ‌ర్డ్ ప్లేస్ కోసం జ‌రిగే మ్యాచ్ రోజున అంటే 18 రాత్రి నుంచి 19వ తేదీ తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల వ‌ర‌కు, ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగే రోజున అంటే 20వ తేదీన తెల్లవారుజామున 3 గంట‌ల వ‌ర‌కు బార్లు, క్ల‌బ్బులు, మైక్రో బ్రూవ‌రీలు తెరిచి ఉంటాయ‌ని ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ అంత‌ట అనుకుంటే పొర‌పాటే..?

అయితే బార్లు, క్ల‌బ్బులు, మైక్రో బ్రూవ‌రీలు.. ఆ రెండు రోజులు తెలంగాణ అంత‌ట తెరిచి ఉంటాయ‌నుకుంటే పొర‌పాటే. కేవ‌లం క్యూర్ ప‌రిధిలో మాత్ర‌మే ఇవి తెరిచి ఉండ‌నున్నాయి. తెలంగాణ కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ప‌రిధిలోని ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ అభిమానుల‌కు ఇక పండుగే అన్న‌మాట‌.

Advertisement
Advertisement