త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suryapet | కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్‌ అరెస్ట్‌

Suryapet | ఏకంగా జిల్లా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టరేట్‌ అటెండర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖాతా అప్‌గ్రేడేషన్‌ కోసం పత్రాలు సిద్ధం చేసే క్రమంలోనే సంతకం చేసినట్లు బ్యాంకు మేనేజర్‌ వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

P

Telangana | Published On Aug 18, 2026, 4.56 pm IST

Suryapet | కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్‌ అరెస్ట్‌
Advertisement
  • అటెండ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హారం వెలుగులోకి..
  • డీఆర్డీవో పీడీ ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు

Suryapet | ఏకంగా జిల్లా కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంకు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కలెక్టరేట్‌ అటెండర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖాతా అప్‌గ్రేడేషన్‌ కోసం పత్రాలు సిద్ధం చేసే క్రమంలోనే సంతకం చేసినట్లు బ్యాంకు మేనేజర్‌ వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోటక్‌ మహీంద్రా బ్యాంకులో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య పేర్లతో జాయింట్‌ అకౌంట్‌ ఉంది. ఈ ఖాతా అప్‌గ్రేడేషన్‌ కోసం బ్యాంకు మేనేజర్‌ రఘుప్రసాద్‌ పత్రాలు సిద్ధం చేశారు. డీఆర్డీవో పీడీ సన్యాసయ్య సంతకం చేయగా.. కలెక్టర్‌ అందుబాటులో లేరు. కలెక్టర్‌ సంతకం చేసిన పత్రాలను స్టాంప్‌ కోసం కలెక్టరేట్‌ అటెండర్‌ వద్దకు బ్యాంకు మేనేజర్‌ తీసుకెళ్లారు.

అయితే, సంతకం ఎప్పటిలా లేదని గుర్తించిన అటెండర్‌ వెంటనే కలెక్టర్‌ గన్‌మెన్‌, సీసీలకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ విచారణ చేపట్టారు. తాను సంతకం చేసిన సమయంలో కలెక్టర్‌ సంతకం పత్రంపై లేదని పీడీ సన్యాసయ్య స్పష్టం చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు సన్యాసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంకు మేనేజర్‌ రఘుప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కలెక్టర్‌ సంతకాన్ని ఏ ఉద్దేశంతో ఫోర్జరీ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement