Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ
Ethics Committee | ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం, సమానత్వం వంటి విలువలను మరింత బలోపేతం చేయడమే ఎథిక్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ ఛైర్మన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, నైతిక ప్రమాణాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.
- శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్
Ethics Committee | ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయం, సమానత్వం వంటి విలువలను మరింత బలోపేతం చేయడమే ఎథిక్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ ఛైర్మన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, నైతిక ప్రమాణాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. శాసన మండలి ఎథిక్స్ కమిటీ (2026-27) ప్రాథమిక సమావేశం మంగళవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. కమిటీ ఛైర్మన్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి నైతిక విలువలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రతినిధుల ప్రధాన ధ్యేయంగా ఉండాలని, శాసనసభ, శాసన మండలి సభ్యులు సమాజానికి ఆదర్శంగా వ్యవహరించాలని సూచించారు.
విమర్శలు హద్దులు దాటొద్దు
ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడ ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల్లో సద్విమర్శ అవసరమేనని, అయితే విమర్శలు హద్దులు దాటకూడదని సూచించారు. చట్టసభల్లో సభ్యుల పనితీరును ప్రజలు లోతుగా గమనిస్తారని, అందువల్ల హుందాగా వ్యవహరిస్తూ విలువలను కాపాడుకుంటూ పనిచేయాలని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభా చర్చల్లో భాష వినియోగం విషయంలోనూ సభ్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సభ గౌరవాన్ని కాపాడేలా..
నైతిక ప్రమాణాల అమలు, శాసన వ్యవస్థ గౌరవం, ప్రజల విశ్వాస పరిరక్షణ దిశగా ఎథిక్స్ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యుల హక్కుల పరిరక్షణకు ఏ విధంగా పనిచేస్తుందో.. అదే విధంగా సభ్యుల విలువలు, నైతిక ప్రమాణాలను ప్రతిబింబించేలా ఎథిక్స్ కమిటీ పనిచేస్తుందని అన్నారు. చట్టసభ సభ్యుల ప్రవర్తన ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
ఆగస్టు 18, 2026

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
ఆగస్టు 18, 2026

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
- ●Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
- ●Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
- ●Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు

Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?

Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్



