త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?

Harish Rao | జీతాల కోసం శాంతియుతంగా నిర‌స‌న‌కు దిగిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను అరెస్టు చేయ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. జీతాలు అడిగితే అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

S

Telangana | Published On Aug 18, 2026, 4.53 pm IST

Harish Rao | లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : జీతాల కోసం శాంతియుతంగా నిర‌స‌న‌కు దిగిన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను అరెస్టు చేయ‌డాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న‌ద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. జీతాలు అడిగితే అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి, సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. రూపాయి చెల్లించకుండా రాష్ట్రవ్యాప్తంగా 6,500 మంది సర్వేయర్లు ఏడాది కాలంగా ఎలా జీవించాలి? వారి కుటుంబాలను ఎలా పోషించాలి? అని ప్ర‌శ్నించారు. అరెస్టులతో సర్వేయర్ల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం. వారి సమస్యలకు పరిష్కారం చూపాలి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లైసెన్స్డ్ సర్వేయర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement