Bank Holidays | బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు..
Bank Holidays | త్రినేత్ర.న్యూస్: మీరు వివిధ పనుల నిమిత్యం నిత్యం బ్యాంకులకు (Bank) వెళ్తూ ఉంటారా? రోజూ డిపాజిట్లు, విత్‌డ్రాలు చేస్తుంటారా? అయితే మీకోసమే ఈ వార్త.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు (Bank Holidays) మూతపడనున్నాయి.
Bank Holidays | త్రినేత్ర.న్యూస్: మీరు వివిధ పనుల నిమిత్యం నిత్యం బ్యాంకులకు (Bank) వెళ్తూ ఉంటారా? రోజూ డిపాజిట్లు, విత్‌డ్రాలు చేస్తుంటారా? అయితే మీకోసమే ఈ వార్త.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు (Bank Holidays) మూతపడనున్నాయి. శుక్రవారం మొహర్రం (Muharram) కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక నాలుగో శనివారం, ఆ తర్వాత ఆదివారం. ఇలా మూడు రోజులు బ్యాంకులకు సెలవులే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జూన్ 2026 సెలవుల (Holidays) జాబితా ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలను కలుపుకుని ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం కూడా సుదీర్ఘ సెలవులు వచ్చాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, బెలాపూర్, భోపాల్, అగర్తలా, ఐజ్వాల్, జమ్ము, శ్రీనగర్, కాన్పూర్, లక్నో, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ పరిధిలో మొహర్రం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.
జూన్ 27న నాలుగో శనివారం కావడంతో ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా మూతపడతాయి. ఇక జూన్ 28న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ వీకెండ్ ఆదివారం సెలవు ఉంటుంది.
ఆ సేవలు యథాతథం..
బ్యాంకు బ్రాంచీలు (Bank Branch) మూతపడినప్పటికీ, కస్టమర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆన్‌లైన్ సేవలు (Online Sevices) నిరంతరం అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు 24 గంటలూ సజావుగా పనిచేస్తాయి. కేవలం డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ క్లియరెన్స్ వంటి ఇన్-బ్రాంచ్ సేవల కోసం మాత్రమే కస్టమర్లు మూడు రోజులు వేడి ఉండాల్సిందే.
తాజావార్తలు
- ●SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ
- ●OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
- ●CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి
- ●Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు
- ●Anupama Parameswaran | ఢీ డ్యాన్స్ షో జడ్జ్‌గా అనుపమ పరమేశ్వరన్ - బ్రేకప్ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ
- ●Saidabad Steel Bridge | ప్రభుత్వ కట్టడాలకు అగ్రకులాల పేర్లు పెట్టడం అన్యాయం

SCR | 17 రైల్వే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు.. 2023 కి.మీ. మేర విస్తరణ

OTT | 5 కోట్ల బడ్జెట్ - 130 కోట్ల కలెక్షన్స్ - విజయ్, రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ... ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్

CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.11 వేల కోట్లు చెల్లించాం.. 72 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: రేవంత్‌రెడ్డి

Indiramma Towers | నెరవేరిన సొంతింటి కల.. 7340 ఫ్లాట్ల కేటాయింపు






