RBI | ఫ్లోటింగ్ రేట్ రుణగ్రస్తులకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపులకు జరిమానా లేదు..
RBI | ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలను ముందుగానే పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించినా బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఈ నిబంధన రుణగ్రహీతలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతోపాటు, మెరుగైన వడ్డీ రేట్లు అందించే ఇతర రుణ సంస్థలకు మారేందుకు సహాయపడనుంది.
RBI | ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలను ముందుగానే పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించినా బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ఈ నిబంధన రుణగ్రహీతలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంతోపాటు, మెరుగైన వడ్డీ రేట్లు అందించే ఇతర రుణ సంస్థలకు మారేందుకు సహాయపడనుంది.
ఫ్లోటింగ్ రేట్ రుణాలను తీసుకున్నవారికి ఆర్బీఐ కీలక వెసులుబాటు..
బ్యాంకుల నుంచి గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికి ఆర్బీఐ కీలక వెసులుబాటు కల్పించింది. రుణగ్రహీతలు వార్షిక బోనస్, జీతం పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయం లేదా కుటుంబ సభ్యులు ఇచ్చిన మొత్తంతో రుణాన్ని ముందుగానే చెల్లించుకోవచ్చు. ఇలా చెల్లించడం వల్ల అసలు రుణ బకాయి తగ్గడంతోపాటు, భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలను బ్యాంకులు, సంబంధిత ఆర్థిక సంస్థలు వసూలు చేయకూడదని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిబంధనలు చెల్లింపుల బ్యాంకులను మినహాయించి వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), అఖిల భారత ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయి. రుణాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ముందుగానే చెల్లించినా ఈ మినహాయింపు వర్తిస్తుంది. రుణ చెల్లింపులకు ఉపయోగించే నిధుల మూలం ఏదైనా, రుణానికి ఇతర వ్యక్తులు జాయింట్ బారోవర్లుగా ఉన్నా ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
ఏయే రుణాలకు వర్తిస్తాయి..?
ఈ నిబంధనలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో కూడిన డ్యూయల్ రేట్, ప్రత్యేక వడ్డీ రేటు రుణాలకూ వర్తిస్తాయి. అయితే రుణాన్ని ముందుగానే చెల్లించే సమయంలో అది ఫ్లోటింగ్ వడ్డీ రేటులో ఉండాలి. ముందస్తు చెల్లింపునకు కనీస నిరీక్షణ కాలం కూడా లేదు. ఈ నిబంధనల పరిధిలోకి రాని రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల వివరాలను రుణ మంజూరు పత్రం, రుణ ఒప్పందం, కీలక వాస్తవాల ప్రకటన (కీ ఫ్యాక్ట్స్ స్టేట్‌మెంట్)లో స్పష్టంగా పేర్కొనాలి. కొందరు రుణదాతలు ఇతర బ్యాంకులకు మారకుండా రుణగ్రహీతలపై పరిమితులు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకొచ్చారు. జనవరి 1 నుంచి మంజూరయ్యే లేదా పునరుద్ధరించే రుణాలకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయి. గతంలో మినహాయించిన ఛార్జీలను తిరిగి వసూలు చేయడం లేదా వెల్లడించని ఇతర రుసుములను విధించడం కూడా రుణదాతలకు అనుమతించరు.
బ్యాంకులు జరిమానా విధిస్తే ఏం చేయాలి?
ఒకవేళ అర్హత ఉన్నప్పటికీ బ్యాంకు ముందస్తు చెల్లింపు జరిమానా విధిస్తే రుణగ్రహీతలు ముందుగా తమ రుణ ఒప్పందంలోని నిబంధనలను పరిశీలించాలి. ముఖ్యంగా తమ రుణం ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో ఉందా, ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఉందా అనేది నిర్ధారించుకోవాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం జరిమానా నుంచి మినహాయింపు పొందేందుకు అర్హులైతే సంబంధిత బ్యాంకును సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. బ్యాంకు స్పందించకపోతే దాని అధికారిక ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే ఆర్బీఐ ఫిర్యాదుల పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
- ●Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా
- ●Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?
- ●RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు
- ●Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..
- ●CM Revanth Reddy | కృష్ణా నుంచి ఆంధ్రకు ప్రతిరోజూ 13 టీఎంసీలు
- ●Srinath Maganti | విడుదలకు ముందు ట్రోలింగ్ - ఇప్పుడు ప్రశంసలు

Raashi Khanna | ఓ వైపు సినిమా - మరోవైపు వెబ్‌సిరీస్ - బ్రేక్ లేకుండా కష్టపడుతోన్న రాశీఖన్నా

Bromate in Packaged Drinking Water | మనం తాగే మినరల్ వాటర్ బాటిళ్లలో క్యాన్సర్ కారక రసాయనాలా? అసలు బిస్లెరీ వివాదం ఏంటి?

RERA | ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు రేరా అనుమతులు

Google Trends India 2026 | ఆరోగ్యం, విహారయాత్రలపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తి.. గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్ ఇవే..






