త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మ‌ర‌ణం

Road Accident | సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. కారు, ట్రాక్టర్ ఢీకొన్న‌ ఘ‌ట‌న‌లో తండ్రితో పాటు ఏడేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Nov 9, 2026, 7.49 pm IST

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. కారు, ట్రాక్టర్ ఢీకొన్న‌ ఘ‌ట‌న‌లో తండ్రితో పాటు ఏడేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యతో పాటు కుమారుడుని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కొండాపూర్‌కు చెందిన పైడపల్లి శ్రీకాంత్ (33) త‌న భార్య స్వాతి, కుమార్తె మ‌హాన్వి (7), కుమారుడు విహాన్ క్రిష్‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమ‌వారం వారి స్వ‌గ్రామానికి కారులో బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో హుస్నాబాద్ మండ‌లంలోని పందిళ్ల వంతెన దాటిన త‌ర్వాత ప‌వ‌న‌సుత మిల్లు స‌మీపంలోకి రాగానే కారు, ట్రాక్ట‌ర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, మహాన్వి మృతి చెందారు. కుమారుడికి స్వల్ప గాయాలు కాగా ట్రాక్టర్ డ్రైవర్ కాలు విరిగింది.

ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement