త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | డీప్‌ఫేక్ బారిన ప‌డిన శ్రీలీల – మ‌రో న‌టి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి…

రెడ్ డ్రెస్‌లో శ్రీలీల బోల్డ్‌గా క‌నిపిస్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోపై నెట్టింట తెగ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఒరిజిన‌ల్ వీడియో అని భావించిన కొంద‌రు ఆఫ‌ర్ల కోస‌మే శ్రీలీల ఆందాల‌ను ఆర‌బోత‌కు సిద్ధ‌ప‌డిందంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియో వెన‌కున్న అస‌లు ట్విస్ట్ ఏంటంటే?

N

Entertainment | Published On Nov 10, 2026, 4.03 pm IST

Sreeleela | డీప్‌ఫేక్ బారిన ప‌డిన శ్రీలీల – మ‌రో న‌టి వీడియోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి…
Advertisement

Sreeleela | డీప్‌ఫేక్, మార్ఫింగ్ స‌మ‌స్య‌లు సెలిబ్రిటీల‌కు అతిపెద్ద స‌మ‌స్య‌గా మారిపోయాయి. ఏఐని దుర్వినియోగం చేస్తూ హీరోయిన్ల‌ను అస‌భ్యంగా చిత్రీక‌రిస్తూ ఫొటోలు, వీడియోల‌ను కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డీప్‌ఫేక్ అనే అనుమానం ఏ మాత్రం రాకుండా ఒరిజిన‌ల్ త‌ల‌పించేలా ఉంటున్న ఈ పోస్ట్‌ల కార‌ణంగా హీరోయిన్ల ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతోంది. జాన్వీక‌పూర్‌, మృణాల్ ఠాకూర్‌, రుక్మిణి వ‌సంత్‌తో పాటు చాలా మంది హీరోయిన్ల ఇటీవ‌ల మార్ఫింగ్ ఫొటోల‌పై పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. తాజాగా ఈ డీప్‌ఫేక్ బారిన హీరోయిన్ శ్రీలీల కూడా ప‌డింది.

రెడ్ డ్రెస్‌లో...

రెడ్ డ్రెస్‌లో శ్రీలీల గ్లామ‌ర్ డోస్ పెంచుతూ క‌నిపించిన ఓ వీడియో మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో శ్రీలీల పాల్గొన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోస్తూ శ్రీలీల క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. బాలీవుడ్‌లో ఆఫ‌ర్ల కోసం శ్రీలీల బోల్డ్ లుక్‌లో క‌నిపించిందంటూ డిస్క‌ష‌న్లు మొద‌ల‌య్యాయి. ఈ వీడియో వెన‌కున్న అస‌లు ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది.

డీప్‌ఫేక్‌...

ఏఐ సాయంతో చేసిన డీప్‌ఫేక్ వీడియో ఇద‌ని తేలింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభిషేక్ కుమార్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో పాల్గొన్న మ‌రో హీరోయిన్ ఫొటోను మార్ఫింగ్ చేసి శ్రీలీల అటెండ్ అయిన‌ట్లుగా అశ్లీలంగా క్రియేట్ చేశారు. ఈ మార్ఫింగ్ వీడియోను పోస్ట్, షేర్ చేయ‌డం ఆపేయాలంటూ శ్రీలీల‌ను ట్యాగ్ చేస్తూ ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ డీప్‌ఫేక్‌ వీడియోపై శ్రీలీల మాత్రం రియాక్ట్ కాలేదు.

కోలీవుడ్‌....బాలీవుడ్‌...

ట్రిపుల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్ల‌తో టాలీవుడ్‌కు దూర‌మైన శ్రీలీల...కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో ధ‌నుష్ ఓంతో పాటు ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు హిందీలో రెండు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

 

Advertisement
Advertisement