త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sai Bhagirath | కాఫీ షాపులో ప్రేమాయణం.. పోక్సో కేసుతో శుభం కార్డు.. బండి కుమారుడి ఆరు నెల‌ల ప్రేమ క‌థ ఇదీ..!

Bandi Sai Bhagirath | ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ముందు పరిచయమయ్యారు. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. నగర శివారులోని ఓ కాఫీ షాపులో విర‌బూసిన వారి ప్రేమ‌ అక్కడితో ఆగలేదు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత గాఢంగా ప్రేమించుకున్నారు.

S

Telangana | Published On May 9, 2026, 4.03 pm IST

Bandi Sai Bhagirath | కాఫీ షాపులో ప్రేమాయణం.. పోక్సో కేసుతో శుభం కార్డు.. బండి కుమారుడి ఆరు నెల‌ల ప్రేమ క‌థ ఇదీ..!
Advertisement

ఆరు నెల‌ల నుంచి సాగుతున్న
బండి కుమారుడి ఫ్రెండ్‌షిప్‌
అమ్మాయి వయసు 17 ఏళ్లే
వీకెండ్ ట్రిప్పులు
రీసార్టుల‌లో గ్యాద‌రింగులు
ప్రేమిస్తున్నాన‌ని చెప్పి
లొంగబరుచుకున్న వైనం
డిసెంబరు 31 రాత్రి ఏం జరిగింది?

Bandi Sai Bhagirath | త్రినేత్ర.న్యూస్ : ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు. ముందు పరిచయమయ్యారు. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. నగర శివారులోని ఓ కాఫీ షాపులో విర‌బూసిన వారి ప్రేమ‌ అక్కడితో ఆగలేదు. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి షికారు చేశారు. హాలిడే ట్రిప్పులు వెళ్లారు. 6 నెలలకే ఆ ప్రేమకు పోక్సో కేసుతో శుభం కార్డు పడింది.

కాఫీ షాపులో మొదలై..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగర శివారులోని ఓ కాఫీ షాపులో బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. పదో తరగతి వ‌ర‌కు చదివిన ఆ అమ్మాయికి కేవలం 17 ఏళ్ల వయసు మాత్రమే ఉండడం గమనార్హం. పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారి ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. వీకెండ్ ట్రిప్పులకు వెళ్లేవారు. విజయవాడ, కంచి, తిరుమల, తిరుత్తణి, ఫళని, అరుణాచలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా తిరిగొచ్చారు. ఓ సినీ ప్రేమ క‌థ‌కు త‌గ్గ‌కుండా.. వీరి ప్రేమాయ‌ణం సాగింది.

డిసెంబరు 31 రాత్రి.. ఆ రిసార్టులో

2025 డిసెంబరు 31 వేడుకలకు సదరు బాలిక, సాయి భగీరథ్ వారం ముందు ప్లాన్ చేసుకున్నారు. డిసెంబర్ 31 కోసం మోయినాబాద్‌లోని ఓ రిసార్టును బుక్ చేసుకున్నారు. ఆ రోజు రాత్రి సదరు బాలికను సాయి భగీరథ్ లొంగబరుచుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని తమ ఫిర్యాదులో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ప్రస్తావించారు. కాగా, మైనర్ బాలికను లైంగికంగా వేధించినందుకు గాను బండి సాయి భగీరథ్‌పై పేట బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement