BRS Protest | బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి.. పట్టణ కేంద్రాల్లో బీఆర్ఎస్ భారీ నిరసనలు
BRS Protest | బండి భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఆయా పట్టణ కేంద్రాల్లో బీఆర్ఎస్ సోమవారం భారీ నిరసనలు చేపట్టింది. హుజూరాబాద్‌లో బండి సంజయ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు చెప్పులతో కొడుతూ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు దాడికి దిగారు.
- రణరంగంగా మారిన సిరిసిల్ల
- బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణుల గూండాయిజం
- పలువురి అరెస్టు
BRS Protest | త్రినేత్ర.న్యూస్: బండి భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఆయా పట్టణ కేంద్రాల్లో బీఆర్ఎస్ సోమవారం భారీ నిరసనలు చేపట్టింది. హుజూరాబాద్‌లో బండి సంజయ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు చెప్పులతో కొడుతూ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు దాడికి దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
సిరిసిల్లలో బీజేపీ శ్రేణుల గూండాయిజం..
రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత నిరసనకు అనుమతులు తీసుకున్నారు. ఈ క్రమంలో వారు సోమవారం అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి నిరసన తెలుపుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. అనుమతి లేకుండా నిరసన స్థలం వద్దకు దాడికి తెగబడ్డారు. ఇదే సమయంలో బండి సంజయ్, బండి భగీరథ్‌లకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. తీవ్ర తోపులాటలు చోటుచేసకున్నాయి. వెంటనే పోలీసులు నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. రెండు వైపులా శాంతింపజేశారు. అనంతరం బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాలికకు న్యాయం జరగాలి..
కేంద్ర మంత్రి బండి సంజయ్ బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్‌లోనూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. బాధిత బాలికకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వేములవాడలోనూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే @KaushikReddyBRS ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి.ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ… pic.twitter.com/GLDC4X0FWV
— BRS Party (@BRSparty) May 18, 2026
మైనర్ బాలికకు న్యాయం చేయాలి..
బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ..
వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు @Brs_chalmeda ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. pic.twitter.com/I9FrKLUBZ1— BRS Party (@BRSparty) May 18, 2026
సిరిసిల్లలో బీజేపీ శ్రేణుల గూండాయిజం
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ శ్రేణులు అరెస్ట్
బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన బీజేపీ గూండాలు
రెండు రోజుల క్రితం… pic.twitter.com/BWjvtWqQhX
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026
తాజావార్తలు
- ●Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి
- ●Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా
- ●Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్
- ●EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..
- ●Stock Markets | అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్.. భారీగా పతనమైన సూచీలు..
- ●Telangana | రుదాలీల మాదిరి.. 'కల్వకుంట్ల' తెగకు ఏడుపే

Ponguleti | ప్రజలపై బీఆర్ఎస్ రూ.8.5 లక్షల కోట్ల అప్పుభారం.. రెండేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు : పొంగులేటి

Hardeep Singh Nijjar | ట్రూడోకు షాక్.. నిజ్జర్ హత్యలో భారత అధికారుల ప్రమేయం లేదన్న కెనడా

Donald Trump Iran Deal | ఆ ఒప్పందం ఇక ముగిసినట్లే.. ఎలాంటి డీల్ లేదన్న ట్రంప్.. తగ్గేదే లే అంటున్న ఇరాన్

EPFO | ఈపీఎఫ్‌వో చందాదారులకు గుడ్ న్యూస్.. జూలై 15లోపు వడ్డీ జమ..





