త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేద‌న్న‌ అధికారులు..!

P

Hyderabad | Published On Nov 26, 2026, 8.58 pm IST

Moosapet | మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి లైన్ క్లియర్.. హైకోర్టు స్టే లేద‌న్న‌ అధికారులు..!
Advertisement

Moosapet | కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేట లేఅవుట్ భూముల ఈ-వేలానికి తెలంగాణ హైకోర్టు ఎలాంటి మధ్యంతర స్టే విధించ‌లేద‌ని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27న (శుక్రవారం) ఈ-వేలం నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. వేలం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. మూసాపేట లేఅవుట్‌లోని సర్వే నంబర్లు 121/P నుంచి 141 వరకు, 146, 147, 155 నుంచి 157 వరకు ఉన్న మొత్తం 3 ఎకరాల 15 గుంటల భూముల వేలాన్ని సవాల్‌ చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ట్రక్ అసోసియేషన్‌తో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు డబ్ల్యూపీ నంబర్లు 39957/2026, 39813/2026తో పాటు పీఐఎల్ నంబర్లు 37, 38/2026 దాఖలయ్యాయి. అయితే, ఈ పిటిషన్లపై హైకోర్టు ఈ-వేలాన్ని నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని వేలం నిర్వహణకు సంబంధించిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నవంబర్ 27న నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఈ-వేలం కొనసాగనుంది. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement