త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhageerath | బండి భ‌గీర‌థ్ క‌నబ‌డుట లేదు..హైద‌రాబాద్‌లో వెల‌సిన‌ పోస్టుర్లు

Bandi Bhageerath | కేంద్ర హోంశాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) క‌న‌బ‌డుట లేదంటూ హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు వెలిశాయి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భ‌గీర‌థ్‌ అబ్‌స్కాండింగ్ అంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.

G

Telangana | Published On May 13, 2026, 12.39 pm IST

Bandi Bhageerath | బండి భ‌గీర‌థ్ క‌నబ‌డుట లేదు..హైద‌రాబాద్‌లో వెల‌సిన‌ పోస్టుర్లు
Advertisement

Bandi Bhageerath | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర హోంశాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhageerath) క‌న‌బ‌డుట లేదంటూ హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు వెలిశాయి. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భ‌గీర‌థ్‌ అబ్‌స్కాండింగ్ అంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు. ‘బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తెలియజేయండి’ అని పోస్ట‌ర్ల‌లో రాసి ఉంది. బండి సంజ‌య్ కుమారుడిపై ఈ నెల 10న పోక్సో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీంతో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన ఆయ‌న.. అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. భగీరథ్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

పోక్సో కేసు వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ద‌ర్యాప్తులో భాగంగా భగీరథ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొంది. కాగా, తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్‌.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మ‌రోవైపు పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాలు ధ‌ర్నా నిర్వ‌హించాయి. కేబినెట్ నుంచి బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీస్ స్టేష‌న్‌లోకి చొచ్చుకెళ్లేందుకు మ‌హిళ‌లు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భ‌గీర‌థ్ కనపడట్లేదంటూ ప‌లువురు మెట్రోలో పోస్టర్లతో ప్రచారం నిర్వ‌హించారు. కనిపిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు చెప్పాలంటూ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement