Balmoor Venkat | బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
Balmoor Venkat | బీఆర్ఎస్ (BRS) పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఆ పార్టీ విధానమే దళితులను మోసం చేయడం, అవమానించడం, అవహేళన చేయడమేనని మండిపడ్డారు.
Balmoor Venkat | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) పార్టీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేక విధానం ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచీ ఆ పార్టీ విధానమే దళితులను మోసం చేయడం, అవమానించడం, అవహేళన చేయడమేనని మండిపడ్డారు. కుక్కతోకకు గుండు కడితే సక్కగా రాదు అన్నట్లు బీఆర్ఎస్ నేతలకు ఎంత చెప్పినా బుద్ధి మాత్రం మారటం లేదని ధ్వజమెత్తారు. దళితులు ధర్నా చేస్తే ఆ ప్రాంతం మైల పడుతుందా?, ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) పార్టీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వేముల వీరేశంతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసనసభాపతిని పరుష పదజాలంతో దూషించారని యావత్ తెలంగాణ సమాజం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ జాతికి చెందిన స్పీకర్‌నే తిట్టడాన్ని (Gaddam Prasad Kumar) తట్టుకోలేక దళిత సోదరులు డప్పు దరువులతో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తే. ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేయడమంటే జాతి వివక్షత, అంటరాన్ని తనాన్ని చూపినట్లేనని చెప్పారు.
ఫామ్ హౌస్‌లో పడుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) స్పందించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దళిత సమాజమే బీఆర్ఎస్ పార్టీని వెలివేసి, అంటరాని పార్టీగా గుర్తిస్తుందన్నారు. బీఆర్ఎస్ విధానం మొదటి నుంచి దళిత వ్యతిరేకమేనని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్‌లో దళిత నేత డిప్యూటీ సీఎంగా ఉంటే తీసేశారని, దళిత నేత భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షనేతగా చేస్తే, ఆ హోదా లేకుండా చేశారని వెల్లడించారు.
నిరసన వ్యక్తం చేశారనే కారణంతో దళిత నాయకులు ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. నేడ అత్యున్నత పదవిలో ఉన్న శాసనసభాపతిని కూడా దూషించారు. కుక్కతోకకు గుండు కడితే సక్కగా రాదు అన్నట్లు బీఆర్ఎస్ నేతలకు ఎంత చెప్పినా బుద్ధి మాత్రం మారటం లేదు. నిన్న కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితి మార్చుకోకపోతే ప్రజలే ఆ పార్టీ నేతలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం
- ●Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం
- ●Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!
- ●Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం
- ●BRS MLAs | పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..
- ●Adani Enterprises | అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

Surat textile market | సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దుకాణాలు ధ్వంసం

Addanki Dayakar | మేము అప్డేటెడ్ వర్షన్ దళితులం

Mookuthi Amman 2 | దీపావళి బరిలో బిగ్ క్లాష్..! రామాయణానికి పోటీగా మూకుత్తి అమ్మన్..!

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వడంపై సుప్రీం ఆగ్రహం




